Mon Dec 30 2024 18:49:17 GMT+0000 (Coordinated Universal Time)
రానా కోసం పవన్ ను వాడుకున్నారు : డైరెక్టర్ ఆర్జీవీ
భీమ్లా నాయక్ ట్రైలర్ చూశాక.. ఆ సినిమాను భీమ్లా నాయక్ గా పిలిచే కంటే.. డానియల్ శేఖర్ అని పిలవాలని అనిపిస్తుందని..
భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చేసింది. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో.. అంతకుముందు సినిమాల ట్రైలర్ల రికార్డులు బద్దలు కొట్టేలా దూసుకుపోతోంది. పవన్ అభిమానులు ఫుల్ హ్యాపీ. ఇంతకీ పవన్ కు తానొక పెద్ద అభిమానిగా చెప్పుకునే రామ్ గోపాల్ వర్మకు ట్రైలర్ నచ్చిందా ? అంటే అస్సలు నచ్చలేదంటూ ట్వీట్ చేశారు. ట్రైలర్ చూశాక ఆయన చాలా హర్ట్ అయ్యారంట.
భీమ్లా నాయక్ ట్రైలర్ చూశాక.. ఆ సినిమాను భీమ్లా నాయక్ గా పిలిచే కంటే.. డానియల్ శేఖర్ అని పిలవాలని అనిపిస్తుందని తన అభిప్రాయం తెలిపారు. నిర్మాతలు రానా ను ప్రమోట్ చేసేందుకు.. పవన్ కల్యాణ్ ను ఉపయోగించారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ట్రైలర్ లో పవన్ కంటే రానాకే ఎక్కువ హైప్ వచ్చిందన్నారు. పవన్ అభిమానిగా తాను చాలా హర్ట్ అయ్యానని తెలిపారు. వర్మచేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Next Story