లక్ష్మీ పార్వతీ ఇకనైనా తెలుసుకో -- కేతిరెడ్డి
"శనివారం రాత్రి ఒక టీవీ డిబేట్లో రాంగోపాల్ వర్మ తన దర్శకత్వంలో రానున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రం తాను గతంలో నిర్మించిన జిఎస్టీ కంటే ఎక్కువ అడల్ట్ కంటెంట్ ఈ సినిమాలో ఉంటుందని తెలపడం జరిగింది. నేను తీసే చిత్రం లక్ష్మీస్ వీరగ్రంధం ఆదర్శ గృహిణి అనే ట్యాగ్‌లైన్‌తో అన్నగారి ఆదేశం ప్రకారం నిర్మిస్తుంటే లక్ష్మీపార్వతి అడ్డుపడుతుంది. ఇప్పుడు వర్మగారు నేరుగా తాను నిర్మించే చిత్రం పూర్తిగా అడల్ట్ కంటెంట్‌తో ఉంటుందని చెప్పిన తరువాత కూడా లక్ష్మీపార్వతి ఎందుకు నోరువిప్పటంలేదు. వర్మగారితో మిలాఖత్ అయ్యి జిఎస్టీని మించిన లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను నిర్మించేందుకు సిద్దమయ్యారా? తిరుపతిలో సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా కూడా వర్మ తన ప్రసంగంలో శ్రీదేవి, జయప్రద, జయసుధ లాంటి అందగత్తెలుండగా లక్ష్మీపార్వతిలో ఏం చూసి ఆయన సినిమా తీస్తానని చెప్పడం జరిగింది. దీనిని బట్టి మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే వర్మగారు శనివారం చెప్పనదానికి, గతంలో చెప్పినదానిని ఆధారంగా చేసుకుంటే రామారావు జీవితంలోని ఒక కోణాన్ని జిఎస్టీ సినిమాలా తీసేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తుంది. దీనికి లక్ష్మీపార్వతి నాపైన చేసిన ప్రతి ఆరోపణకు, అదే విధంగా వర్మ ప్రస్తుతం తను తీస్తున్న చిత్రంపట్ల కథాంశం యొక్క నిజాన్ని ప్రజలకు తెలియజేశాడు కాబట్టి లక్ష్మీపర్వతిగారూ దీనికి మీరు బాధ్యత వహించి అన్నగారి అభిమానులకు, అన్నగారిని అభిమానించే ప్రజలకు రాంగోపాల్ వర్మ జిఎస్టీకంటే అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా తీయడానికి మీ అంగీకారం ఉన్నట్లేనా. ఇలాంటి సినిమా తీస్తానని వర్మ ధైర్యంగా, పబ్లిక్‌గా చెబుతుంటే మీరు ఇప్పటికీ వారిని స్వాగతించి సినిమా తీయడానికి అంగీకారం తెలిపి.. అన్నగారిని ఆత్మక్షోభకు గురిచేస్తారా? మీరే నిర్ణయించుకోవాలి. అందుకే మీ ద్వంద వైఖరిని మార్చుకో.. నువ్వు చెప్పినట్లు వర్మ సినిమా తియ్యడు. అతని ఉన్న గుణగణాలను బట్టి నీకు తాను తీసే కథ చెప్పడు. కానీ పైన అతను చెప్పిన ప్రతిమాటను తన చిత్రంలో చూపిస్తాడు. ఆలోచించుకో... వర్మ మాట్లాడుతున్నప్పుడు మీరు వేదికమీద ముసిముసి నవ్వులు నవ్వినంత సులభం కాదు.. వర్మతో మీ ప్రయాణం. నేను జిఎస్టీలాంటి సినిమా తీస్తానని చెప్పలేదు. శృంగార భరితంగా తీస్తానని చెప్పలేదు. యవ్వనంలో ఉన్న ఒక మహిళ వయసు ఎక్కవగా ఉన్నవ్యక్తి మధ్య జరిగే ప్రేమే మాచిత్ర కథ అని చెప్పాం. ఇకనైనా లక్ష్మీపార్వతి మమ్మల్ని స్వాగతించి అన్నగారి ఆత్మసంతోషానికి కారణం కావాలని" లక్ష్మీస్ వీరగ్రంధం సినిమా దర్శకులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు.