Mon Dec 23 2024 11:58:45 GMT+0000 (Coordinated Universal Time)
అప్పుడప్పుడూ నాక్కూడా ఫీలింగ్స్ ఉంటాయ్ : ఆర్జీవీ
వర్మ పోస్టులు, మాటలు అలా ఉంటాయి మరి. ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో.. ఎవరిని అభినందిస్తారో ఆయనకే తెలియదు. వర్మ మాటతీరును..
హైదరాబాద్ : సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అది సెన్సేషన్ కావాల్సిందే. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా అది సంచలనమే అవుతుంది. వర్మ పోస్టులు, మాటలు అలా ఉంటాయి మరి. ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో.. ఎవరిని అభినందిస్తారో ఆయనకే తెలియదు. వర్మ మాటతీరును బట్టి.. ఉన్నది ఉన్నట్లుగా మొహం మీద చెప్పే స్వభావం ఆయనది. అందుకే వర్మకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని అందరూ అంటుంటారు.
కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని స్వయంగా వర్మనే చెప్పారు. తనకు ఎలాంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉండవని పేర్కొన్నారు. కానీ.. తాజాగా ఆర్జీవీ ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఒక కుక్కను ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకున్న ఫోటోను వర్మ ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ పోస్టుకు.. 'నాక్కూడా ఫీలింగ్స్ ఉంటాయి' అని క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Next Story