Sun Dec 22 2024 22:26:55 GMT+0000 (Coordinated Universal Time)
పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ కేసీఆర్ : వైరలవుతోన్న వర్మ ట్వీట్
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 అడుగు జాడల్లో పయనిస్తున్న టీఆర్ఎస్ జాతీయ స్థాయి రాజకీయాల్లోకి..
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో కేసీఆర్ ను రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అంటూ పొగిడారు. తెలుగులో పాన్ ఇండియా సినిమాలుగా గుర్తింపు సాధించిన సినిమాలు, వాటిలో లీడ్ రోల్స్ లో కనిపించిన హీరోల పేర్లను వర్మ ట్వీట్ లో పేర్కొనడం ఆశ్చర్యం కలిగించే విషయం. సినిమాల గురించి మొదలుపెట్టి.. పొలిటికల్ వైపు టర్న్ అయింది ఆ ట్వీట్.
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 అడుగు జాడల్లో పయనిస్తున్న టీఆర్ఎస్ జాతీయ స్థాయి రాజకీయాల్లోకి బీఆర్ఎస్గా ఎంట్రీ ఇవ్వనుందని వర్మ తెలిపారు. రీల్ ఫిల్మ్ స్టార్లు అయిన యశ్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌ల మాదిరిగా కాకుండా కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్‌గా నిలవనున్నారని ఆర్జీవీ ట్వీట్లో పేర్కొన్నాడు. ఉన్నట్టుండి ఆర్జీవీకి కేసీఆర్ పై అంత ప్రేమ ఎందుకొచ్చిందో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Next Story