Mon Dec 23 2024 14:42:59 GMT+0000 (Coordinated Universal Time)
Shapadham : వెబ్ సిరీస్గా ఆర్జీవీ వ్యూహం, శపథం.. ఆ ఓటీటీలో రిలీజ్..
వ్యూహం, శపథం సినిమాలను వెబ్ సిరీస్ గా తీసుకు రావడమే తన అసలు వ్యూహం అంటున్న ఆర్జీవీ. ఆ ఓటీటీలో రేపటి నుంచి..
Vyooham - Shapadham : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లైఫ్ స్టోరీతో ఏపీ రాజకీయాల్లోని కొన్ని నిజాలను అందరికి చెబుతాను అంటూ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాలు 'వ్యూహం', 'శపథం'. వ్యూహం సినిమా ఆల్రెడీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. విడుదల అవ్వడానికి ఎన్నో అడ్డంకులు ఎదురుకున్న ఈ చిత్రం.. మార్చి 2న రిలీజ్ అయ్యింది. అయితే థియేటర్స్ లో ఈ చిత్రం ఎలాంటి సందడి చూపించలేకపోయింది.
ఇక రెండో పార్ట్ అయిన 'శపథం' రేపు మార్చి 8న రిలీజ్ చేస్తామంటూ గతంలోనే ప్రకటించారు. కానీ ఇప్పుడు రేపు రిలీజ్ అవుతుందో లేదో అనే విషయం కూడా క్లారిటీ లేదు. ఆర్జీవీ కూడా రిలీజ్ గురించి ఏం మాట్లాడడం లేదు. కానీ ఇప్పుడు సడన్ గా శపథం సినిమాని వెబ్ సిరీస్ గా తీసుకు వస్తున్నామంటూ పోస్టు వేశారు. వ్యూహం, శపథం సినిమాల వెనుక తమ అసలు వ్యూహం వెబ్ సిరీస్ గా తీసుకు రావడమే అంటూ పేర్కొన్నారు.
ఈక్రమంలోనే శపథం సినిమాని 'చాప్టర్ 1 - ఆరంభం', 'చాప్టర్ 2 - అంతం' టైటిల్స్ తో వెబ్ సిరీస్ గా తీసుకు వస్తున్నామంటూ ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ ని AP ఫైబర్ నెట్ లో పే పర్ వ్యూ ద్వారా చూడొచ్చు అంటూ చెప్పుకొచ్చారు. చాప్టర్ 1ని మార్చి 7 రాత్రి 8 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు, చాప్టర్ 2ని మార్చి 8 రాత్రి 8 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ అనౌన్స్మెంట్ చూస్తుంటే.. శపథం థియేటర్ రిలీజ్ లేనట్లే తెలుస్తుంది.
Next Story