Mon Dec 23 2024 03:18:09 GMT+0000 (Coordinated Universal Time)
రామ్ పై అభిమానంతో కొడుకుకి ‘స్కంద’ పేరు పెట్టిన అభిమాని..
హీరో రామ్ మీద అభిమానంతో ఒక ఫ్యాన్ తన కొడుకుకి 'స్కంద' అనే పేరుని పెట్టుకొని..
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'స్కంద' (Skanda) సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలీల (Sreeleela) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉంటే, రామ్ మీద అభిమానంతో ఒక ఫ్యాన్ చేసిన పని.. ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటుంది.
రామ్ వీరాభిమాని అయిన 'హరహర' అనే వ్యక్తి.. రీసెంట్ గా తండ్రి అయ్యాడు. ఇక ఇటీవల తన బిడ్డకు నామకరణ వేడుక కూడా చేశాడు. అయితే ఆ కొడుకుకి పేరు పెట్టడంలో కూడా తన అభిమానాన్ని చూపించుకున్నాడు. రామ్ పై వీరాభిమానంతో రిలీజ్కి రెడీగా ఉన్న ‘స్కంద’ మూవీ టైటిల్ని తన కొడుకుకి పేరుగా పెట్టాడు. ఇక ఈ విషయాన్ని ఒక అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ పోస్ట్ రామ్ వరకు చేరింది. దీంతో రామ్ కూడా దానిపై స్పదించాడు.
"నీ అభిమానం నా హృదయాన్ని తాకింది. ఆ స్కంద స్వామి అశీసులు మీ బాబు పై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా స్కంద సెప్టెంబర్ 28న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ మూవీలో రామ్ పక్కా ఊరమస్ క్యారెక్టర్ లో దర్శనం ఇవ్వబోతున్నాడు.
ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే టీజర్, ట్రైలర్, కొన్ని సాంగ్స్ ని రిలీజ్ చేసిన మేకర్స్ నేడు వినాయక చవితి సందర్భంగా మూవీలోని ఐటెం సాంగ్ ని రిలీజ్ చేశారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా, రామ్ తో కలిసి ‘కల్ట్ మామ’ అంటూ మాస్ చిందులేసింది. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు.
Next Story