Mon Dec 23 2024 11:12:59 GMT+0000 (Coordinated Universal Time)
Skanda : రామ్‌కి డూప్‌గా బోయపాటి ఎందుకు నటించాల్సి వచ్చింది..?
స్కంద సినిమాలో రామ్‌కి డూప్‌గా బోయపాటి ఎందుకు నటించాల్సి వచ్చిందో చెప్పిన హీరో.
Skanda : రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ మూవీ 'స్కంద'. శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్స్ గా శ్రీకాంత్, దగ్గుబాటి రాజా తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యి.. బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. నవంబర్ 2 నుండి డిస్నీప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఈ సినిమాలోని ఒక విషయాన్ని.. ఆడియన్స్ థియేటర్ లో కనిపెట్టలేకపోయారు. కానీ ఓటీటీలో అది గమనించారు.
ఈ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ లో రామ్ కి డూప్‌గా బోయపాటి శ్రీను నటించాడు. అందుకు సంబంధించిన ఓ ఫోటోని ఒక ప్రముఖ తెలుగు డిజిటల్ మీడియా నెట్టింట షేర్ చేసింది. ఇక ఇది కాస్త వైరల్ గా మారగా.. దీని పై నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయం పై హీరో రామ్ రియాక్ట్ అయ్యాడు. ఆ షాట్ లో తనకి డూప్‌గా బోయపాటి నటించింది నిజమే అంటూ తెలియజేశాడు. అయితే అలా చేయడానికి గల కారణం చెప్పాడు.
"ఆ సన్నివేశం షూటింగ్ ని ఫుల్ సమ్మర్ లో 2023 ఏప్రిల్ 22న చేసినట్లు చెప్పుకొచ్చాడు. అలాంటి మందు వేసవిలో చెప్పులు లేకుండా షూటింగ్ చేయడంతో మూడో రోజు రామ్ కాళ్ళ నుంచి రక్తం రావడం మొదలైందట. దీంతో రామ్ కొంచెం బ్రేక్ తీసుకున్నాడు. ఇక రామ్ బాధని చూసిన బోయపాటి.. ఆ ఒక్క షాట్ ని తానే నటించి పూర్తి చేశాడట. అంతేతప్ప అభిమానులను మోసం చేయాలని కాదు. అభిమానులు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. అలాగే ఆ షాట్ నాకోసం చేసిన నా దర్శకుడికి థాంక్యూ" అంటూ ట్వీట్ చేశాడు.
Next Story