Mon Dec 23 2024 03:55:54 GMT+0000 (Coordinated Universal Time)
బోయపాటి సినిమాపై రామ్ పోస్ట్.. ఏమన్నాడంటే
ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా విడుదల కోసం వెయిటింగ్ అంటూ రామ్-బోయపాటి ఫ్యాన్స్
అఖండ సినిమాతో బాలయ్యతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బోయపాటి శ్రీను.. ప్రస్తుతం రామ్ పోతినేని తో ఓ సూపర్ మాస్ ఎంటర్టైనర్ ను తీసే పనిలో ఉన్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులకు కూడా అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. #BOYAPATIRAPO వర్కింగ్ టైటిల్ తోనే సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇటీవల రామ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ ను పెంచాయి. తాజాగా #BOYAPATIRAPO సినిమాపై రామ్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
మొత్తానికి 24 రోజులపాటు కష్టపడి స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తిచేశాం. ఇది క్లైమాక్స్ కాదు.. CliMAXXXXX’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు రామ్. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా విడుదల కోసం వెయిటింగ్ అంటూ రామ్-బోయపాటి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కూడా మోస్ట్ వాంటెండ్ గా మారిన శ్రీలీల నే హీరోయిన్ గా నటిస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న #BOYAPATIRAPO ఇటీవలే డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టింది. ఈ సినిమాతో రామ్ పాన్ ఇండియా మార్కెట్లో కూడా అడుగుపెట్టనున్నాడు. చాలా కాలం తర్వాత రామ్ చేస్తున్న ఈ సినిమా హిట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 20న సినిమాను విడుదల చేయనున్నారు.
Next Story