Mon Dec 23 2024 12:36:16 GMT+0000 (Coordinated Universal Time)
స్కంద కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
ప్రభాస్ సలార్ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల
ప్రభాస్ సలార్ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయింది. ఆ రిలీజ్ డేట్ న తమ సినిమాలను విడుదల చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు సిద్ధమయ్యారు. రామ్ పోతినేని-బోయపాటి శీను కాంబినేషన్ లో వస్తున్న 'స్కంద' సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకుంది. సెప్టెంబర్ 15న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే సలార్ వాయిదా పడడంతో స్కంద ఆ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.
తాజాగా స్కంద సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించేశారు. సెప్టెంబర్ 28న రూల్స్ రంజన్ సహా విజయ్ ఆంటోని కొత్త సినిమా కూడా విడుదల కానుంది. సెప్టెంబర్ 15న విడుదలయ్యే చంద్రముఖి సీక్వెల్, మార్క్ ఆంటోని సినిమాలపై మంచి హైప్ వచ్చింది. ఇప్పుడు తెలుగు స్టేట్స్ కూడా థియేటర్స్ ఈ రెండు సినిమాలకు దక్కనున్నాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన స్కంద సినిమాలో రామ్కు జోడీగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన అన్ని పాటలు హిట్ అయ్యాయి. ఈ సినిమాకు ఇప్పటికే భారీ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. సెప్టెంబర్ 18న వినాయక చవితి ఉండటంతో లాంగ్ వీకెండ్ ను ఉపయోగించుకోవచ్చని స్కంద టీమ్ మొదట భావించింది. కానీ ఇప్పుడు సలార్ రిలీజ్ డేట్ అయిన సెప్టెంబర్ 28న స్కంద కూడా వచ్చేస్తోంది.
Next Story