Mon Dec 23 2024 18:01:20 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిపురుష్ నుండి మరో సాంగ్
రామ్ సీతారాం.. సీతారాం జయ్ జయ్ రామ్ అంటూ సాగే పాట కూడా ఆకట్టుకుంటుంది. ఈ పాటకు తెలుగు లిరిక్స్ ను రామజోగయ్య శాస్త్రి..
శ్రీరాముడిగా ప్రభాస్ - సీతగా కృతి సనన్.. వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగా తెరకెక్కిన మైథలాజికల్ సినిమా ఆదిపురుష్. జూన్ 16వ తేదీన ఆదిపురుష్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల తేదీకి సమయం దగ్గర పడుతుండటంతో.. చిత్రయూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే జైశ్రీరామ్ పాటకు కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. ట్రైలర్, పాటతో సినిమా అంచనాలు పెరిగాయి. తాజాగా ఆదిపురుష్ నుంచి "రామ్ సీతారాం" పాటను మేకర్స్ విడుదల చేశారు.
ఈ వీడియో సాంగ్ లో పాటతో పాటు మధ్యమధ్యలో సీతారాముల మధ్య వచ్చే సంభాషణలు, సీత-రావణ్ ల మధ్య డైలాగ్ ను కూడా పెట్టారు. ఈ జానకి ఎప్పటికీ రాఘవుడిదే.. రాఘవుడు ఎక్కడుంటే అదే జానకి మందిరం అన్న సంభాషణలు బాగున్నాయి. రామ్ సీతారాం.. సీతారాం జయ్ జయ్ రామ్ అంటూ సాగే పాట కూడా ఆకట్టుకుంటుంది. ఈ పాటకు తెలుగు లిరిక్స్ ను రామజోగయ్య శాస్త్రి రాశారు. కాగా.. జూన్ 6వ తేదీన తిరుపతి వేదికగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. బాహుబలి ప్రీ రిలీజ్ వేడుక కూడా అక్కడే నిర్వహించగా.. ఆ సినిమా హిట్ కావడంతో ప్రభాస్ సెంటిమెంట్ గా ఆదిపురుష్ ఈవెంట్ కూడా ఇక్కడే చేయాలనుకున్నారు.
ఆదిపురుష్ సినిమాను తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తుందని తెలిసిందే. అయితే తాజాగా ఈ రైట్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. థియేట్రికల్ రైట్స్ ను ఏకంగా రూ.170 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ ను టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించాయి.
Next Story