Mon Nov 18 2024 16:42:52 GMT+0000 (Coordinated Universal Time)
ఎంతగానో అలరిస్తున్న 'రామరామ అయ్యో రామ' పాట!
రాముడిని కీర్తిస్తూ ఎన్ని పాటలు వచ్చినా శ్రోతలు వింటూనే ఉంటారు
రాముడిని కీర్తిస్తూ ఎన్ని పాటలు వచ్చినా శ్రోతలు వింటూనే ఉంటారు. అలాంటిది మరో పాట ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ ఉంది. అదే రామరామ అయ్యో రామ.. పాట.. నీకేష్ కుమార్ దశగ్రంథి ఈ పాటను మనకు అందించాడు. ఎంతో గొప్పగా ఉండే ఈ పాటను మీరు కూడా వినండి..మీకు తెలిసిన వారికి కూడా చేరవేయండి.
ఎంత వినినా చదివినా తనివితీరనిది రామాయణం రామ కథ.. సీత రామ కథ...!
అలాంటి అద్భుతమైన అనాది చరితకు సులభమైన సాహిత్యాన్ని బరువెక్కిన భావాన్ని మేళవించి మరో సారి స్పృశించి తరలించాలన్న ఉడతా ప్రయత్నమే ఈ పాట. రామ రామ అయ్యా రామ ...ఎంత కష్టమొచ్చెనయ్యో రామ.. అంటూ సాగే ఈ పాట రామాయణం లోని భావాన్ని భావోద్వేగాన్ని మరోసారి మనసుకు గుర్తు చేసి మననమై నిలుస్తుంది అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు.
పై మాటకు నిలువెత్తు నిదర్శనం 'పాట యూట్యూబ్ మాధ్యమం లో విడుదలైన కొన్ని గంటల్లోనే 500 K కు పై చిలుకు వ్యూస్ ని సొంతం చేసుకుని ఊహించని వేగంలో దూసుకెళుతూ ఉంది. కేవలం బంధుమిత్ర ఇతర ప్రేక్షకుల ఆదరణతోనే ఈ మైలురాయి చేరుకుంది. మంచి కంటెంట్ ను ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారన్నది ఈ పాట కూడా రుజువు చేస్తూ ఉంది.
మీరు ఇంకా వినకపోతే ఒకసారి వినగలరు అనిపిస్తే పంచుకొని ఆనందించగలరు...!
Song: #RamaRamaAyyoRama
Link : https://youtu.be/SrRIoEBeR6Q?si=5YXC9lYtNW72NWHW
Lyrics, Vocals, Concept & Video : Nikesh Kumar Dasagrandhi
Sounds, Mix & Master : KBR Audio Lab, music inspired by Original Composition inspired by ‘Avakaya Anjaneya’ from HanuMan Movie.
||యత్ర యాత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ వాష్పవారిపరిపూర్ణాలోచనం మారుతిం నమత్ రాక్షసాన్తకమ్ ॥
#JaiShriram #JaiHanuman
Next Story