Mon Dec 23 2024 13:01:31 GMT+0000 (Coordinated Universal Time)
"రామారావు ఆన్ డ్యూటీ" వాయిదా ! ముందే ఖిలాడి
2021లో క్రాక్ తో హిట్ కొట్టిన రవితేజ.. నెక్ట్స్ "రామారావు ఆన్ డ్యూటీ" తో థియేటర్లలోకి వస్తాడని అందరూ అనుకున్నారు. మేకర్స్ కూడా అదే చెప్పారు. కానీ.. ఇప్పుడు ఆ సినిమా విడుదల కాస్త వాయిదా పడింది. "రామారావు ఆన్ డ్యూటీ" ని వెనక్కి నెట్టేసి.. ఖిలాడి ముందు విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా 2022, ఫిబ్రవరి 11వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ ప్రకటన చేశారు.
ఖిలాడీ తర్వాత "రామారావు ఆన్ డ్యూటీ" వస్తున్నాడు. శరత్ మండవ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు కానీ.. ఇప్పుడు విడుదల తేదీని మార్చుకున్నారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని శరత్ మండవ ట్వీట్ చేశారు. భవిష్యత్ అంతా వైరస్ ఫ్రీ గా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా.. "రామారావు ఆన్ డ్యూటీ" సినిమా విడుదలను ఎందుకు వాయిదా వేశారన్న విషయం మాత్రం చెప్పలేదు. రవితేజ రెండు సినిమాల మధ్య గ్యాప్ నెల రోజులు మాత్రమే ఉండటం వలన వాయిదా వేశారా? లేక ఒమిక్రాన్ విరుచుకుపడనుందనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారా? అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story