ఆ నటనకు అన్ని కోట్లా
అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు రామాయణాన్ని మూడు భాగాలుగా పలు భాషల్లో నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాలో [more]
అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు రామాయణాన్ని మూడు భాగాలుగా పలు భాషల్లో నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాలో [more]
అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు రామాయణాన్ని మూడు భాగాలుగా పలు భాషల్లో నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాలో రాముడిగా హ్రితిక్ రోషన్ కన్ఫర్మ్ అయ్యాడని… రావణుడిగా ప్రభాస్ తో చర్చలు జరుపుతున్నారని, సీత పాత్రకి దీపికాని సంప్రదించగా ఆమె కాదంది కాబట్టి మరో హీరోయిన్ని సీత కోసం వెతుకుతున్నారనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. అరవింద్ ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి.. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే వచ్చేసాయి.
మూడు భాగాలుగా ….
ఇక సీత పాత్రకి ఈ ఏడాది బాలీవుడ్ లో సలహా తోనూ, చిచ్చోరె సినిమాల్తో హిట్ అందుకున్న శ్రద్ద కపూర్ ని సంప్రదించినట్లుగా వార్హలొస్తున్నాయి. అయితే రామాయణంలో సీత పాత్రలో నటించడానికి తనకేమి అభ్యంతరం లేదని… కాకపోతే ఆ సినిమా చేసినందుకు తనకి 10 నుంచి 12 కోట్ల పారితోషికం కావాలని రామాయణం నిర్మాతలను డిమాండ్ చేసిందట. మరి మూడు భాగాలుగా సినిమా చేస్తున్నప్పుడు.. ఆ మాత్రం డిమాండ్ చెయ్యడం కరెక్ట్ అని శ్రద్ద కపూర్ వాదన.