#RC12 లుక్ అండ్ టైటిల్ రాకపోవడానికి కారణమిదేనా?
రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో డి.వి.వి.దానయ్య ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోందన్న వార్త తప్ప ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం మెగా అభిమానులను బాధపెడుతోంది. మెగాస్టార్ పుట్టినరోజుకు మెగాపవర్‌స్టార్ సినిమాకి సంబంధించిన న్యూస్ వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత పవన్‌కల్యాణ్ బర్త్‌డేకి ఓ సర్ప్రైజ్ ఉంటుందని చరణ్ స్వయంగా ఎనౌన్స్ చేశాడు. కానీ, ఏమీ జరగలేదు. కనీసం వినాయక చవితికి అయినా టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తారని ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. అప్పుడు కూడా ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఈ విజయదశమికి ఎట్టి పరిస్థితుల్లో సినిమా అప్డేట్ ఉంటుందనుకున్నారు. ఇప్పుడు కూడా ఏమీ లేదు.
ఇంతకీ కథేంటి....?
ఓ పక్క సోషల్ మీడియాలో ఇలా చేశాడేంటి బోయపాటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు మెగా ఫాన్స్. ఇక #RC12 టైటిల్ స్టేట్‌రౌడీ అనీ, వినయవధేయ రామా అని రకరకాలుగా వినిపిస్తున్నాయి. చిత్ర యూనిట్ మాత్రం ఇవేవీ పట్టనట్టు ఉండిపోయింది. చిత్ర యూనిట్ స్పందించకపోయినా ఈ సినిమాకి వినయ విధేయ రామ అనే టైటిల్ దాదాపు ఖాయమైపోయింది. ఆ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌నీ పండక్కి విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే.. టైటిల్ లోగో డిజైన్ పట్ల బోయపాటి అసంతృప్తితో ఉన్నాడట. అయితే తనకి తృప్తినిచ్చేలా లోగో తీర్చిదిద్దినప్పుడే ఈ టైటిల్‌ని విడుదల చేయాలని బోయపాటి ఫిక్సయ్యాడని ఫిలింనగర్ టాక్.
అందుకే రిలీజ్ చేయకుండా......
అందుకే రామ్ చరణ్ - బోయపాటి సినిమా టైటిల్ గాని, లుక్ గాని నిన్న దసరా కానుకగా విడుదల చెయ్యలేదని సోషల్ మీడియాలో ఒక న్యూస్ మెగా ఫాన్స్ ని చల్లబరిచేందుకు ట్రై చేస్తుంది. టైటిల్‌తో పాటు లుక్‌నీ విడుదల చేయాలన్న ఉద్దేశంతోనే లుక్‌నీ దాచిపెట్టారని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో అనేది ఆ మెగా అభిమానులకే తెలియాలి సుమీ.