రామ్ చరణ్... మాస్ అంటే ఇదేనేమో..!
మాస్ లో నేనే కింగ్ అని నిరూపించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ ఏడాది వచ్చిన 'రంగస్థలం' సినిమాతో నాన్ 'బాహుబలి' రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి మాస్ లో తన పవర్ ఏంటో నిరూపించాడు చరణ్. ప్రస్తుతం చరణ్ - బోయపాటి డైరెక్షన్ లో 'వినయ విధేయ రామా' చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతుంది. ఇందులో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది.
అందరినీ ఆకట్టుకునేలా...
టైటిల్ అందుకే ఫ్యామిలీస్ ని ఎట్రాక్ట్ చేసేలా కనిపిస్తుంది. 'రంగస్థలం' రేంజ్ లో ఇది అందరినీ ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి హిందీ డబ్బింగ్ - శాటిలైట్ రూపంలో 22 కోట్ల డీల్ పూర్తయిందంటూ ప్రచారం సాగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ కాంపిటీషన్ నడుమ 5.6 కోట్లకు డీల్ కుదిరిందని సమాచారం. అక్కడ 'రంగస్థలం' సినిమాను 4.2 కోట్లకు రైట్స్ కొనుక్కుంటే 6.35 కోట్ల షేర్ వసూలు చేసింది. నైజాంలో 24 కోట్ల రేంజ్ బిజినెస్ చేస్తున్నారన్న సమాచారం అందింది.
భారీ ధరలకు హక్కులు...
కృష్ణ, గుంటూరులో సైతం ఈ సినిమా రైట్స్ కోసం ఎగపడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గుంటూరులో ఈ సినిమాను సీ, డీ కేంద్రాల హక్కుల కోసమే 1.6 కోట్లు వెచ్చించి జయరామ్ అనే పంపిణీదారుడు దక్కించుకున్నట్టు సమాచారం. ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. జనవరి 11న ఈ సినిమాతో పాటు జనవరి 10న 'ఎన్టీఆర్' బయోపిక్, వెంకీ - వరుణ్ ల 'ఎఫ్ 2' సినిమా 12 న, రజినీ 'పెట్టా', అజిత్ 'విశ్వాసం' సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి.