చరణ్ స్ట్రాటజీ బాగుంది గురూ..!
రామ్ చరణ్ సినిమాకి బోయపాటికి 'వినయ విధేయ రామ' అని టైటిల్ పెట్టడానికి ఒక కారణం ఉంది. మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ ని కూడా థియేటర్స్ తీసుకుని రావాలని బోయపాటి ప్లాన్. బెల్లంకొండ శ్రీనివాస్ 'జయ జానకీ నాయక' విషయంలో కూడా ఇదే చేశాడు బోయపాటి. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ తో అదే ప్లాన్ వేసి సక్సెస్ కొడదాం అని ట్రై చేస్తున్నాడు. టైటిల్ ని ఎరగా వేసి ఫామిలీస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ని కూడా అట్రాక్ట్ చేయాలన్నదే బోయపాటి ప్లాన్. అయితే ఈసారి ఆ పోపులు ఏమీ ఉడికేటట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ సినిమాను మాస్ సినిమాగానే ప్రమోట్ చేయాలి తప్ప క్లాస్ సినిమా అనే భ్రమ కల్పించరాదని బోయపాటి కి చరణ్ గట్టిగా చెబుతున్నాడట.
రంగస్థలంలోనూ అలానే...
టీజర్, ట్రైలర్ చూసే ప్రేక్షకులు ఈ సినిమా ఇలా ఉంటుంది, ఆలా ఉంటుంది అని అనుకుని వస్తారు కాబట్టి మన సినిమాలో మెయిన్ ప్లాట్ ఏదో ముందే చెప్పేస్తే బెటర్ అని చరణ్ ఆలోచనట. అందుకే చరణ్ ఫస్ట్ లుక్ కోసం పంచెకట్టుతో సాంప్రదాయబద్ధంగా ప్లాన్ చేసినా కానీ చివరకు కత్తి పట్టిన స్టిల్లే బయటకి వచ్చింది. దీనిని బట్టి ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చి నిరాశ పడరనేది చరణ్ వాదన. తన గత సినిమా 'రంగస్థలం' లో చరణ్ పాత్రని సినిమా రిలీజ్ అయ్యేదాకా దాచి వుంచాలని తొలుత భావించినా అది సబబు కాదని ముందే దానిని రివీల్ చేసేసారు. దాంతో ప్రేక్షకులు ఎటువంటి అంచనాలు పెట్టుకుని రావాలో ముందుగానే డిసైడ్ అయి వస్తారు. కాబట్టి వినయ విధేయ రామ విషయంలో కూడా అలానే చేద్దాం అని చరణ్ ఆలోచనట. అందుకే టీజర్ లో కూడా ఇదొక మాస్ మూవీ అని చెప్పేసారు.