Sun Dec 22 2024 21:24:07 GMT+0000 (Coordinated Universal Time)
రామ్ చరణ్-శంకర్ సినిమా నుండి సాంగ్ లీక్ ?!
రామ్ చరణ్- శంకర్ పాన్ ఇండియన్ ఫిల్మ్ 'గేమ్ ఛేంజర్' నుండి సాంగ్ లీక్ అయిందని సోషల్ మీడియా వినియోగదారులు
రామ్ చరణ్- శంకర్ పాన్ ఇండియన్ ఫిల్మ్ 'గేమ్ ఛేంజర్' నుండి సాంగ్ లీక్ అయిందని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతూ ఉన్నారు. శుక్రవారం రాత్రి గేమ్ ఛేంజర్ సాంగ్ అంటూ ఆన్ లైన్ లో ఓ పాట వైరల్ గా మారింది. దీంతో చిత్ర దర్శకనిర్మాతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఈ సినిమాలోని ఓ పాట లీక్ కావడంతో పాటూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు 15 కోట్ల బడ్జెట్తో స్టేడియం తరహాలో ఈ పాటను చిత్రీకరించినట్లు సమాచారం. భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలో ఇలాంటి లీక్ జరగడం నిజంగా షాకింగ్ న్యూస్. శంకర్, అతని బృందం ప్రస్తుతం ఈ చిత్రం కోసం చెన్నై నుండి పని చేస్తున్నారు. అక్కడ నుండే ఈ పాట లీక్ జరిగి ఉండవచ్చని అంటున్నారు. నిర్మాత దిల్ రాజు అండ్ టీమ్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. 'గేమ్ ఛేంజర్' నుంచి లీక్ అయిన సాంగ్ బేసిక్ కంపోజింగ్ వెర్షన్ అని, ట్రాక్ సింగర్స్ పాడారని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఫైనల్ కాపీ రావాల్సి ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగమ్మాయి అంజలి మరో కథానాయికగా నటిస్తూ ఉంది. శ్రీకాంత్, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Next Story