Thu Dec 26 2024 22:37:03 GMT+0000 (Coordinated Universal Time)
Mahesh Babu : బాబాయ్ పాటకి కూతురి మాస్ డాన్స్.. సితార కామెంట్స్
మహేష్ అన్న రమేష్ బాబు కూతురు.. బాబాయ్ కుర్చీ మడతపెట్టి సాంగ్ కి మాస్ డాన్స్ అదుర్స్ అంతే. ఈ డాన్స్పై సితార..
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకి రమేష్ బాబు అనే అన్నయ్య ఉన్న సంగతి తెలిసిందే. రమేష్ బాబు కూడా హీరోగా పలు సినిమాల్లో నటించారు. కాగా ఈయన 2022లో అనారోగ్య సమస్యలతో చనిపోయారు. ఆ సమయంలో మహేష్కి కరోనా వచ్చి అన్నయ్యని చివరి చూపు కూడా చూసుకోలేక చాలా బాధపడ్డారు. ఆ తరువాత వీడ్కోలు కార్యక్రమాల్లో పాల్గొన్న మహేష్.. అన్నయ్య రమేష్ వారసులతో కలిసి దిగిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.
రమేష్ బాబు ఫ్యామిలీ మెంబెర్స్ సినిమా ఇండస్ట్రీలో పెద్దగా కనిపించేవారు కాదు. రమేష్ బాబుకి కొడుడు జయకృష్ణ, కూతురు భారతి.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ పెద్దగా యాక్టీవ్ గా ఉండరు. అయితే ఈమధ్య కాలంలో కూతురు భారతి సోషల్ మీడియాలో నెమ్మది నెమ్మదిగా యాక్టీవ్ అవుతూ వస్తుంది. మొన్నటివరకు ఫొటోలతో ఆకట్టుకున్న భారతి.. ఇప్పుడు బాబాయ్ మహేష్ పాటకి మాస్ డాన్స్ వేసి అదుర్స్ అనిపించింది.
గుంటూరు కారం మూవీలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ కి భారతి మాస్ డాన్స్ వేసి విజుల్స్ ని అందుకుంటుంది. ఇక ఈ డాన్స్ వీడియో పై చెల్లెలు సితార కూడా రెస్పాండ్ అయ్యింది. వరుస కామెంట్స్ చేసి తన ఆనందాన్ని తెలియజేసింది. ఇక మహేష్ బాబు ఈ వీడియోని లైక్ చేసారు. మరి ఆ డాన్స్ వీడియోని మీరు కూడా చూసేయండి.
ఇది ఇలా ఉంటే, భారతి తన ఇన్స్టా బయోలో.. 'Drive in Cinema' అంటూ రాసుకొచ్చారు. ఇది చూస్తుంటే, సితార కంటే ముందు భారతి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందా అనే సందేహం కలుగుతుంది. మరి భారతి ప్రయాణం ఎటువైపు ఉంటుందో చూడాలి.
Next Story