Mon Dec 23 2024 03:42:21 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్జీవీ మిస్సింగ్... మరో వివాదం
ఆర్జీవీ మిస్సింగ్ అనే సినిమా ట్రైలర్ ను రాంగోపాల్ వర్మ విడుదల చేయనున్నారు.
వర్మ అంటేనే వివాదాలు. వివాదాలు లేకుండా వర్మ బతకలేడు. అందులో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి వర్మ బోలెడెంత వ్యూస్, హిట్స్ సంపాదించుకుంటాడు. అలాంటి ప్రయత్నమే మరోసారి రాంగోపాల్ వర్మ చేస్తున్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీని, మెగా ఫ్మామిలీని తన రాబోయే సినిమాలో చేర్చాడు. ఆర్జీవీ మిస్సింగ్ అనే సినిమా ట్రైలర్ ను వర్మ విడుదల చేయనున్నారు.
బాబు, లోకేష్ లను...
ఈ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించాడు. అయితే ఇక్కడ కూడా కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పి పవర్ స్టార్, మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి, అతని కొడుకుపై అనుమానంగా ఉందని ట్వీట్ చేశాడు. చంద్రబాబు, లోకేష్ ల పేర్లను నేరుగా ప్రస్తావించాడు. మరి కొద్దిసేపట్లో ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ విడుదల కానుంది.
Next Story