లక్ష్మీస్ ఎన్టీఆర్ పై వర్మ ముందు రెండు ఆప్షన్లు..!
టాలీవుడ్ లో ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి అంతటా చర్చ నడుస్తుంది. ఈ సినిమా వల్ల తమ నాయకుడి ఇమేజ్ దెబ్బ తింటుందని ఒక పక్క [more]
టాలీవుడ్ లో ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి అంతటా చర్చ నడుస్తుంది. ఈ సినిమా వల్ల తమ నాయకుడి ఇమేజ్ దెబ్బ తింటుందని ఒక పక్క [more]
టాలీవుడ్ లో ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి అంతటా చర్చ నడుస్తుంది. ఈ సినిమా వల్ల తమ నాయకుడి ఇమేజ్ దెబ్బ తింటుందని ఒక పక్క టీడీపీ శ్రేణులు భయపడుతుండగా అదేమీ జరగదని మరి కొంతమంది చెబుతున్నారు. అప్పట్లో కృష్ణ.. ఎన్టీఆర్ పై ఎన్ని సినిమాలు తీసిన అవేమీ ఆయనపై ఎఫెక్ట్ పడలేదని, ఆయన రెండోసారి సీఎం అయ్యారని అంటున్నారు. అయితే అప్పుటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు వేరు. ఇప్పుడు టెక్నాలజీ కూడా పూర్తిగా మారిపోయింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండు ట్రైలర్లు కలిపి ఇప్పటికే ఐదు కోట్లకు పైగా వ్యూస్ తెచ్చుకోవడమే ఇందుకు ఉదాహరణ. అయితే వర్మ చెప్పినట్టు ఈ చిత్రం ఈనెల 22న విడుదల అవుతుందా లేదా అనేది ప్రశ్న.
కోర్టుకు వెళతారా..?
ఈ సినిమాను ఎట్టి పరిస్థితిల్లో ఆపాలని నందమూరి ఫ్యామిలీ కోర్టుకి ఎక్కుతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సూచనలు ఏమీ కనిపించడం లేదు. ఒకవేళ నిజంగానే నందమూరి ఫ్యామిలీ కోర్టుకి వెళ్లి స్టే తెచ్చినా.. వర్మ అన్నట్టు ఏ యుట్యూబ్ లోనో అమెజాన్ ప్రైమ్ లోనో నేరుగా వదిలాడంటే అంతే సంగతులు. థియేటర్స్ లో కంటే ఆన్ లైన్లోకి ఫ్రీగా వస్తుంది కాబట్టి ఇందులోనే ఎక్కువ మంది చూస్తారు. అప్పుడు నిజంగానే పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. ఏదేమైనా త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.