Mon Dec 23 2024 14:43:02 GMT+0000 (Coordinated Universal Time)
రజనీ సినిమాలో రమ్యకృష్ణ.. ఆమె పాత్రే హైలెట్ అట !
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నరసింహా సంచలన విజయాన్ని సాధించింది. మళ్లీ ఈ హిట్ పెయిర్ జత కడుతుండటంతో..
సన్ పిక్చర్స్ బ్యానర్ పై రజనీకాంత్ హీరోగా రూపొందుతోన్న సినిమా జైలర్. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే జైలర్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. తొలుత రోబో కాంబినేషన్ ను రిపీట్ చేద్దామని భావించి ఐశ్వర్యరాయ్ ను సంప్రదించారట. కానీ .. కొన్ని కారణాల వల్ల ఆమె సెట్ కాకపోవడంతో రమ్యకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు.
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నరసింహా సంచలన విజయాన్ని సాధించింది. మళ్లీ ఈ హిట్ పెయిర్ జత కడుతుండటంతో.. సహజంగానే జైలర్ సినిమాపై అంచనాలు పెరిగాయి. పైగా ఇందులో రమ్యకృష్ణ పాత్ర పవర్ఫుల్ గా ఉంటుందని టాక్. త్వరలోనే రమ్యకృష్ణ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. అలాగే ఈ సినిమాలో యోగిబాబు, వినాయకన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Next Story