Sun Dec 22 2024 22:43:35 GMT+0000 (Coordinated Universal Time)
"మళ్లీపెళ్లి" స్ట్రీమింగ్ ఆపించేసిన రమ్య రఘుపతి
థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని.. ఓటీటీలో కూడా విడుదలైనా ఈ సినిమాపై వివాదాలు ఆగలేదు. నరేష్.. తన మూడో భార్య..
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్- పవిత్ర కలిసి నటించిన "మళ్లీపెళ్లి" పై ఇంకా వివాదం జరుగుతూనే ఉంది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని.. ఓటీటీలో కూడా విడుదలైనా ఈ సినిమాపై వివాదాలు ఆగలేదు. నరేష్.. తన మూడో భార్య రమ్యకు విడాకులిచ్చి.. పవిత్రతో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. అసలు రమ్య-నరేష్ ల మధ్య ఏం జరిగిందో.. నరేష్ కోణం నుంచి తీసిన సినిమానే "మళ్లీపెళ్లి". ఈ సినిమాను ఆపాలంటూ ఇప్పటికే రమ్య రఘుపతి పలుమార్లు కోర్టులను, పోలీసులను ఆశ్రయించారు. ఎన్నివివాదాలున్నా ఓ వర్గానికి చెందిన ప్రేక్షకులను మాత్రం "మళ్లీపెళ్లి" ఆకట్టుకుందనే చెప్పాలి.
జూన్ 23 నుంచి ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో ఈ సినిమాను స్ట్రీమ్ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. కానీ.. సినిమాలో తన క్యారెక్టర్ ను కించపరిచేలా చూపించారని, వెంటనే స్ట్రీమింగ్ ఆపాలంటూ రమ్య రఘుపతి రెండు ఓటీటీ సంస్థలకు లీగల్ నోటీసులు పంపి షాకిచ్చారు. లీగల్ నోటీసులు అందుకున్న ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ ను ఆపివేయగా.. ఆహా మాత్రం కంటిన్యూ చేస్తోంది. ఈ వ్యవహారంపై నరేష్, చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Next Story