Mon Dec 23 2024 10:52:05 GMT+0000 (Coordinated Universal Time)
నాని-అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కాంట్రవర్సీ పై రానా రియాక్షన్..
నేషనల్ అవార్డు సమయంలో నాని చేసిన ఒక పోస్ట్ అల్లు అర్జున్ ని విమర్శించేలా ఉందంటూ ఒక కాంట్రవర్సి మొదలయింది. తాజాగా దీనిపై రానా దగ్గుబాటి..
ఇటీవల 69వ నేషనల్ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారంలో తెలుగు సినిమాకి అవార్డుల పంట పండింది. ఇక తెలుగులో మొట్టమొదటి ఉత్తమ నటుడు అవార్డుని అల్లు అర్జున్ (Allu Arjun) అందుకోవడం మరో విశేషం. ఈ అవార్డులు వచ్చినందుకు టాలీవుడ్ ప్రముఖులు, ఆడియన్స్ ఎంతో సంతోష పడ్డారు. అయితే ఆ సమయంలో హీరో నాని (Nani) చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఫిలిం వర్గాల్లో చర్చకు దారి తీసింది.
తమిళ్ హీరో సూర్య (Suriya) నటించిన జైభీమ్ (Jai Bhim) కి నేషనల్ అవార్డు రాకపోవడం పై నాని బాధ పడుతూ ఒక పోస్ట్ వేశాడు. ఇక ఈ పోస్టుని కొందరు కాంట్రవర్సీ చేసేశారు. అల్లు అర్జున్ కి అవార్డు రావడాన్ని ఇన్‌డైరెక్ట్ గా విమర్శిస్తూనే నాని ఆ ట్వీట్ చేశారంటూ కొంతమంది మాట్లాడం, ఆర్టికల్స్ రాయడం జరిగింది. దీంతో కొన్ని రోజులుగా నాని ఈ విషయమై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నాడు.
ఇక ఈ కాంట్రవర్సీ గురించి నాని ఫ్రెండ్ రానా దగ్గుబాటి (Rana Daggubati) ని ఒక అవార్డుల ప్రెస్ మీట్ లో ప్రశ్నించగా రానా బదులిచ్చాడు. "ఒక ప్రేక్షకుడికి ఒక సినిమా నచ్చుతుంది. మరో ప్రేక్షకుడికి ఇంకో సినిమా నచ్చుతుంది. అలాగే యాక్టర్స్ కి కూడా. జై భీమ్ సినిమాకి అవార్డు వస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ రాలేదు. అందుకు ప్రతి ఒక్కరు బాధ పడ్డారు. అంతేగాని ఆ యాక్టర్ కి ఎందుకు వచ్చిందని అనుకోలేదు. అలా ఎవరు మాట్లాడారు. వాళ్ళు వేసిన ఒక ట్వీట్ ని కాంట్రవర్సి చేసేది మీరు. దానిని రకరకాలుగా ఆర్టికల్స్ రాసి మీరు కాంట్రవర్సి చేస్తున్నారు" అంటూ మీడియాకి కౌంటర్ ఇచ్చాడు.
కాగా నాని చేసిన పోస్ట్ జై భీమ్ మూవీకి ఎందుకు అవార్డు రాలేదని. ఆ సినిమాలో నటించిన సూర్యకి రాలేదని కాదు. అల్లు అర్జున్ అందుకున్నది బెస్ట్ యాక్టర్ అవార్డు. పుష్ప సినిమాకి ఎటువంటి అవార్డు రాలేదు. కాబట్టి నాని చేసిన పోస్ట్ లో ఎటువంటి కాంట్రవర్సి లేదు. మరి ఈ గొడవ ఇక్కడితో ఎండ్ అవుతుందా..? లేదా ఇంకా ముందుకు కొనసాగుతుందా..? చూడాలి.
Next Story