Mon Dec 23 2024 11:30:04 GMT+0000 (Coordinated Universal Time)
దగ్గుబాటి అభిరామ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే?
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్బాబు తనయుడు అభిరామ్
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్బాబు తనయుడు అభిరామ్ పెళ్లి చేసుకున్నాడు. ప్రత్యూష చాపరాలను అభిరామ్ పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో పెళ్లి జరిగింది. ఈ వేడుకకు శ్రీలంకలోని ఓ రిసార్ట్ వేదికైంది. శ్రీలంక నుంచి తిరిగి వచ్చాక దగ్గుబాటి ఫ్యామిలీ ప్రముఖుల కోసం హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
డిసెంబర్ 6న రాత్రి 8.50 గంటలకు శ్రీలంకలోని కలుతర పట్టణంలో అభిరామ్ పెళ్లి జరిగింది. తన దగ్గరి బంధువైన ప్రత్యూషను దగ్గుబాటి అభిరామ్ బుధవారం పెళ్లిచేసుకున్నాడు. ఇటీవలే ప్రత్యూషతో అభిరామ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వివాహ వేడుక కోసం దగ్గుబాటి కుటుంబమంతా శ్రీలంక వెళ్లగా 200 మంది అతిథులు పెళ్లికి హాజరయ్యారని సమాచారం.
Next Story