Mon Dec 23 2024 08:14:05 GMT+0000 (Coordinated Universal Time)
రాణా నాయ్డు ట్రైలర్.. బాబాయ్ - అబ్బాయ్ ల నట విశ్వరూపం
నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ఈ సిరీస్ కు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికీ ఈ సిరీస్ నుండి విడుదలైన
విక్టరీ వెంకటేష్ - రానా దగ్గుబాటి లు మల్టీస్టారర్ గా తెరకెక్కిన వెబ్ సిరీస్ రాణా నాయ్డు (Rana Naidu). నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ఈ సిరీస్ కు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికీ ఈ సిరీస్ నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా సిరీస్ నుండి ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో రానా పోలీస్ ఆఫీసర్ గా, వెంకీ క్రిమినల్ రోల్స్ లో కనిపించారు. వీరిద్దరూ తండ్రి కొడుకులు. క్రిమినల్ అయిన తండ్రిపై కొడుక్కి కోపం. కనీసం అతడిని నాన్న అని కూడా పిలవడు.
తాజాగా విడుదలైన ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. పోలీస్ ఆఫీసర్ అయిన రానా నాయుడు.. బాలీవుడ్ సెలబ్రిటీలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాడు. అక్కడ జరిగే స్కామ్ లు అన్నింట అతని హస్తం ఉంటుంది. తండ్రి నాగ నాయుడు (Venkatesh) జైలు నుంచి తిరిగి వస్తాడు. వాాళ్లిద్దరికీ అస్సలు పడదు. తన కుటుంబం కోసమే నాగ నాయుడు జైలుకెళ్లినట్లు ట్రైలర్ లో చూపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. వెంకీ తన రోల్ లో జీవించేశారు. నెరిసిన జుట్టు, గడ్డం తో అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఇక ఇది బాలీవుడ్ సిరీస్ కాబట్టి కొన్ని బూతులూ వినిపించాయి. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో మార్చి 10న విడుదల కాబోతోంది.
Next Story