Sat Dec 21 2024 12:29:40 GMT+0000 (Coordinated Universal Time)
కూతురికి పేరు పెట్టిన అలియా-రణబీర్.. ఒక్కో భాషలో ఒక్కో అర్థమంటూ పోస్ట్
తాజాగా తమ పాపకి నామకరణం చేశామని అలియా తన ఇన్ స్టా హ్యాండిల్ లో పోస్టుపెట్టింది. అలియా, రణబీర్, పాప ఉన్న ఫోటోని షేర్ చేసి
బాలీవుడ్ స్టార్ కపుల్ అలియాభట్ - రణబీర్ కపూర్.. కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత..ఈ ఏడాది ఏప్రిల్ లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అలియా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయినా.. ఏ మాత్రం బెరుకు లేకుండా పెళ్లైన రెండు నెలలకే ఆమె మూడు నెలల ప్రెగ్నెంట్ అని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. నవంబర్ 6న అలియా అంబానీ ఆస్పత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇంతవరకూ తమ పాపను చూపించలేదు ఆ జంట.
తాజాగా తమ పాపకి నామకరణం చేశామని అలియా తన ఇన్ స్టా హ్యాండిల్ లో పోస్టుపెట్టింది. అలియా, రణబీర్, పాప ఉన్న ఫోటోని షేర్ చేసి.. "తనకి రాహా అని పేరు పెట్టాము. వాళ్ళ డాడీనే ఈ పేరు సూచించాడు. ఈ పేరుకు అనేక అర్దాలు ఉన్నాయి. రాహా అంటే అసలైన అర్ధం దైవ మార్గం. అలాగే స్వాహిలి భాషలో ఆనందం, సంస్కృతంలో వంశం, బెంగాలీలో విశ్రాంతి, సౌకర్యం, అరబిక్‌లో శాంతి అనే అర్దాలు వస్తాయి. అలాగే సంతోషం, స్వేచ్ఛ అనే అర్దాలు కూడా వస్తాయి. ఈ పేరు నిజంగా తనకి సరిపోతుంది. రాహా రాకతో మా జీవితంలో మరింత కాంతి వచ్చి కొత్త జీవితం ప్రారంభించాము" అని రాసుకొచ్చింది.
Next Story