Thu Dec 19 2024 18:40:37 GMT+0000 (Coordinated Universal Time)
Animal : యానిమల్ మూవీలోని ప్యాలెస్.. ఆ హీరోదని తెలుసా..?
యానిమల్ మూవీలో హీరో ఉండే ప్యాలెస్ ఒక బాలీవుడ్ స్టార్ హీరోదని మీలో ఎంతమందికి తెలుసా..? ఇంతకీ ఆ హీరో ఎవరు..?
Animal : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన 'యానిమల్' మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలో ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా.. వైల్డ్ యాక్షన్ వియోలెన్స్ తో ప్రేక్షకులని థ్రిల్ చేస్తుంది. కాగా ఈ సినిమాలో హీరో ఉండే ప్యాలెస్ ఒక బాలీవుడ్ స్టార్ హీరోదని మీలో ఎంతమందికి తెలుసా..?
సినిమాకే రిచ్ లుక్ తీసుకొచ్చిన ఆ ప్యాలెస్.. హీరో సైఫ్ అలీఖాన్కి సంబంధించిన పటౌడీ ప్యాలెస్. సైఫ్ అలీఖాన్ పటౌడీ రాజకుటుంబానికి చెందిన వారసుడు. ప్రస్తుతం ఆ ప్యాలెస్ కి సైఫ్ అలీఖానే ఓనర్. దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 150 గదులతో అరుదైన ఫర్నిచర్ కలిగి ఉన్న ఈ ప్యాలెస్ దాదాపు 800 కోట్ల విలువ ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్యాలెస్ సైఫ్ అలీఖాన్దని బాలీవుడ్ ఆడియన్స్ కి తెలిసే ఉంటుంది. కానీ సౌత్ ఆడియన్స్ కి అంతగా ఐడియా ఉండకపోవచ్చు.
కాగా సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం పలు సినిమాల్లో విలన్ గా చేస్తూ మెప్పిస్తున్నారు. ప్రభాస్ ఆదిపురుష్ లో రావణాసురుడిగా నటించిన సైఫ్.. ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ కి ఇది తెలుగు డెబ్యూట్ మూవీ. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ.. యాక్షన్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుందట.
'భైరవ' అనే పాత్రలో సైఫ్ అలీఖాన్ భయంకరమైన విలనిజం చూపించబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం మూవీలోని హీరోహీరోయిన్ సీన్స్ తో పాటు పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది.
Next Story