Mon Dec 23 2024 11:31:02 GMT+0000 (Coordinated Universal Time)
సందీప్ రెడ్డి, రణబీర్ కపూర్ ‘యానిమల్’ టీజర్ వచ్చేసింది..
సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణబీర్ కపూర్ యానిమల్ టీజర్ వచ్చేసింది.
‘అర్జున్ రెడ్డి’ సినిమాని బాలీవుడ్ లో 'కబీర్ సింగ్'గా తెరకెక్కించి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ ని అందుకున్న టాలీవుడ్ దర్శకుడు 'సందీప్ రెడ్డి వంగ'. ఇక తన తదుపరి సినిమాని కూడా అక్కడే ప్లాన్ చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) తో 'యానిమల్' (Animal) అనే సినిమాని తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని సందీప్ వంగా.. గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో తెరకెక్కించాడు. అప్పుడెప్పుడో ఈ మూవీ నుంచి ఒక ప్రీ టీజర్ ని రిలీజ్ చేశారు.
ఆ టీజర్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. తాజాగా నేడు రణబీర్ బర్త్ డే కావడంతో ఫుల్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ చుట్టూ తిరగబోతుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. అయితే ఈ బాండింగ్ మధ్య ఒక చిన్న సస్పెన్స్ చూపించాడు దర్శకుడు. తనని నిత్యం శిక్షించే తండ్రిని.. హీరో ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్నట్లు సందీప్ వంగా చూపించాడు. మరి వారిద్దరి మధ్య బాండింగ్ ఏంటో ట్రైలర్ లో చూపిస్తాడా..? లేదా సినిమాలోనే చూపిస్తాడా..? చూడాలి.
కాగా రణబీర్ కి తండ్రిగా అనిల్ కపూర్ నటిస్తున్నాడు. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుంది. బాబీ డియోల్, బబ్లూ పృథ్వీరాజ్ విలన్ రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీని డిసెంబర్ 1న హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ కంపెనీ టి సిరీస్.. ఈ మూవీని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.
ఈ మూవీని సందీప్ వంగా డైరెక్ట్ చేస్తుండడంతో టాలీవుడ్ లో కూడా భారీ హైప్ నెలకుంది. మరి కబీర్ సింగ్ తో నార్త్ ఆడియన్స్ ని అలరించిన సందీప్.. ఇప్పుడు యానిమల్ సినిమాతో కూడా ఆకట్టుకుంటాడా..? లేదా..? చూడాలి. ఇక ఈ మూవీ పై రష్మిక కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే బాలీవుడ్ లో పాగా వేయొచ్చని చూస్తుంది. మరి రష్మిక ఆశలని ఈ మూవీని నెరవేరుస్తుందా లేదా చూడాలి.
Next Story