Mon Dec 23 2024 12:14:36 GMT+0000 (Coordinated Universal Time)
రణబీర్ 'యానిమల్' వచ్చేస్తుంది.. టీజర్కి డేట్ లాక్..
రణబీర్, సందీప్ వంగ 'యానిమల్' మూవీకి రావడానికి సిద్ధమైంది. రణబీర్ పుట్టినరోజు నాడు ఈ మూవీ టీజర్ని..
‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ వంగ.. బాలీవుడ్ లో అదే సినిమాని రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor) తో గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో 'యానిమల్' (Animal) అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా దాదాపు కంప్లీట్ చేసుకుంది. పాన్ ఇండియా వైడ్ పర్ఫెక్ట్ రిలీజ్ కోసం డిసెంబర్ 1న ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి డేట్ ఫిక్స్ చేశారు.
తాజాగా చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే మూవీ నుంచి ప్రీ టీజర్ అంటూ ఒక చిన్న గ్లింప్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాగా.. సినిమా పై మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఫుల్ టీజర్ ని రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 28న రణబీర్ పుట్టినరోజు ఉండడంతో ఆ రోజున టీజర్ ని రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. సందీప్ వంగ దర్శకుడు కావడంతో ఈ మూవీ పై టాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
బాలీవుడ్ బడా ప్రొడక్షన్ కంపెనీ T సిరీస్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. రష్మిక మందన్న (Rashmika Mandana) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, అనిల్ కపూర్ తదితరులు బాలీవుడ్ నటులు నటిస్తున్నారు. ఇక ఈ మూవీ చాలా వైలెంట్ గా ఉంటుంది అంటూ సందీప్ వంగా ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. గ్యాంగ్ స్టార్స్ సినిమాల్లో ఇదొక ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందని హామీ ఇస్తున్నారు.
ఈ మూవీ పై రణబీర్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకొని సౌత్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. అలాగే రష్మిక కూడా ఈ మూవీతో హిట్ అందుకొని బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పొజిషన్ అందుకోవాలని చూస్తుంది. మరి వీరి ఆశలను సందీప్ వంగ ఎంతవరకు నిజం చేస్తాడో చూడాలి.
Next Story