Mon Dec 23 2024 03:19:40 GMT+0000 (Coordinated Universal Time)
Ranbir - Yash : రామరావణులుగా రణబీర్, యశ్.. ట్రైనింగ్ కోసం లాస్ ఏంజెల్స్..
రామరావణులుగా రణబీర్, యశ్ రామాయణ సినిమా పనులు మొదలయ్యాయట. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో భాగంగా ట్రైనింగ్ కోసం లాస్ ఏంజెల్స్..
Ranbir Kapoor - Yash : రామాయణ కథని ఎంతమంది ఎన్నిసార్లు రూపొందించి తీసుకు వచ్చినా.. ఆడియన్స్ చూసేందుకు సిద్ధంగా ఉంటారు. 19's కాలంలో రామాయణం పై అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు జనరేషన్ లో రామాయణం పై సినిమాలు రావడం తగ్గింది. తాజాగా ఇప్పుడు మళ్ళీ రామాయణం కథ పై సినిమా మేకర్స్ మక్కువ చూపిస్తున్నారు. ఈ జనరేషన్ వారికీ ప్రభాస్ ని రాముడిగా చూపిస్తూ బాలీవుడ్ మేకర్స్ 'ఆదిపురుష్' సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
కానీ ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక అనేక విమర్శలను ఎదుర్కొంది. ఇప్పుడు బాలీవుడ్ లో మరో రామాయణ సినిమాని తెరకెక్కించడానికి సిద్దమవుతున్నారట. గత కొంతకాలంగా రణబీర్ కపూర్ 'రాముడిగా' రామాయణాన్ని రూపొందించబోతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయ్యిందట. 2024 సమ్మర్లో ఈ మూవీ షూటింగ్ మొదలు కానుందట. ఇక ఈ ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా.. రణబీర్ జనవరిలో లాస్ ఏంజెల్స్ వెళ్ళబోతున్నారట.
ఈ మూవీని భారీ VFX తో తెరకెక్కించబోతున్నారట. ఆస్కార్ విన్నింగ్ వీఎఫ్ఎక్స్ కంపెనీ ఈ సినిమాకి పని చేయబోతుందట. సినిమాలో చాలా భాగం గ్రాఫిక్స్ పై తెరకెక్కిస్తుండడంతో ప్రీ-విజువలైజేషన్ ట్రైనింగ్ కోసం రణబీర్ లాస్ ఏంజెల్స్ వెళ్తున్నారట. ఇక ఈ సినిమాలో రావణాసురిడిగా కేజీఎఫ్ స్టార్ యశ్ నటించబోతున్నారట. సాయి పల్లవి సీతగా కనిపించబోతున్నారట. దంగల్ ఫేమ్ నితేశ్ తివారీ ఈ సినిమాని మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నారట.
సీతారాముల పరిణయ అంకం, రావణ లంక అంకం, రామరావణ యుద్ధ అంకం.. ఇలా మూడు భాగాలుగా రూపొందించబోతున్నారట. త్వరలోనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారట. కాగా ఈ సినిమాని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించబోతున్నారంటూ గతంలో వార్తలు వినిపించాయి. మరి వాటిలో ఎంత నిజముందో తెలియదు.
Next Story