Sun Dec 22 2024 22:05:08 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి రెండు సూపర్ హిట్ సినిమాలు
ఆరేళ్ల తర్వాత దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం.. తమ నటవిశ్వరూపాన్ని..
థియేటర్లలో విడుదలైన సినిమాలు రోజుల వ్యవధిలోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు థియేటర్లలోనే సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే బలమైన కథ అయితే.. ఆ సినిమా సూపర్ హిట్ అయి లాభాలు ఆర్జిస్తుంది. అలా ఇటీవల థియేటర్లలో విడుదలైన రెండు సినిమాలు సూపర్ హిట్ అయి.. ఇప్పుడు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చిన రంగమార్తాండ.. ఓటీటీలోకి కూడా సైలెంట్ గానే ఎంట్రీ ఇచ్చింది.
ఆరేళ్ల తర్వాత దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం.. తమ నటవిశ్వరూపాన్ని ప్రేక్షకులకు మరోసారి చూపించారు. మరాఠీ చిత్రమైన నటసామ్రాట్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. గత నెల ఉగాది కానుకగా విడుదలైన ఈ సినిమా మౌత్ టాక్ తోనే ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేసింది. ఎలాంటి ప్రచారం లేకుండా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న రంగమార్తాండ.. అమెజాన్ ప్రైమ్ లోకి సైలెంట్ గా వచ్చింది.
మాస్ కా దాస్.. విశ్వక్సేన్ - నివేదా పేతురాజ్ జంటగా నటించిన దాస్ కా ధమ్కీ సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. విశ్వక్సేన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా మార్చి 22న విడుదలై.. థ్రిల్లింగ్ హిట్ గా నిలిచింది. విశ్వక్ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఏప్రిల్ 14న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ అయిన ఆహాలో దాస్ కా ధమ్కీ విడుదల కానుంది.
Next Story