Mon Dec 23 2024 03:25:28 GMT+0000 (Coordinated Universal Time)
రంగరంగ వైభవంగా రిలీజ్ డేట్ ఫిక్స్ !
తాజాగా 'రంగ రంగ వైభవంగా' సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. కేతిక శర్మ కథానాయికగా నటించిన ..
హైదరాబాద్ : మెగా కాంపౌండ్ నుంచి ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత కొండపొలంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తాజాగా 'రంగ రంగ వైభవంగా' సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. కేతిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాకు గిరీశాయ దర్శకత్వం వహించాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తోన్న 'రంగ రంగ వైభవంగా' సినిమాను జులై 1న విడుదల చేయనున్నట్లు తెలిపారు. డీఎస్పీ సంగీతం సినిమాకు ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. 'రొమాంటిక్' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కేతిక శర్మ కి, వైష్ణవ్ తేజ్ కి ఇది మూడవ సినిమానే. గ్లామర్ పరంగా కేతికకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. మరి ఈ పెయిర్ ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలంటే.. జులై 1 వరకూ ఆగాల్సిందే.
Next Story