Mon Dec 23 2024 05:15:20 GMT+0000 (Coordinated Universal Time)
దసరా కానుకగా ఓటీటీలోకి రంగ రంగ వైభవంగా..
కొండపొలంతో ఆడియన్స్ ముందుకొచ్చారు. డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. మూడో సినిమాగా..
ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఫస్ట్ సినిమాతోనే నటనపరంగా ప్రశంసలందుకున్న ఈ హీరో.. కొండపొలంతో ఆడియన్స్ ముందుకొచ్చారు. డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. మూడో సినిమాగా రంగ రంగ వైభవంగా విడుదలైంది. సెప్టెంబర్ 2న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్గా నటిచింది. ఈ మూవీలో వైష్ణవ్, కేతికల కెమిస్ట్రీ బాగున్నప్పటికీ.. ప్రేక్షకుల ఊహను అందుకోలేకపోయింది.
తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. రంగ రంగ వైభవంగా సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను స్ట్రీమ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 5 లేదా 7 నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. కానీ.. ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.
Next Story