Sat Mar 15 2025 10:31:42 GMT+0000 (Coordinated Universal Time)
న్యూడ్ గా స్టార్ హీరోయిన్ భర్త.. పీక్స్ అంటున్న నెటిజన్లు
రణవీర్ సింగ్ సింగ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవుతూ ఉన్నప్పటికీ..

రణవీర్ సింగ్.. ఎప్పుడూ కొత్తగా చేయాలని పరితపిస్తూ ఉంటాడు. తన ఫ్యాషన్ సెన్స్ తో సెన్సేషన్ సృష్టిస్తూ వస్తుంటాడు. ఎప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుని తళుక్కుమంటుంటాడో అని అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఈసారి ఏకంగా ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఫోటో షూట్ లో పాల్గొన్నాడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ భర్త.
రణవీర్ సింగ్ సింగ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవుతూ ఉన్నప్పటికీ.. అతను ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తున్నాడు. బేర్ గ్రిల్స్ తో కలిసి అడవిలో చేసిన సాహసాల నుండి షారుఖ్ ఖాన్ 'మన్నత్' పక్కన రూ. 119-కోట్ల భవనాన్ని కొనుగోలు చేయడం వరకు, రణ్వీర్ ఎప్పుడూ హెడ్లైన్స్ లో ఉంటూ వస్తున్నాడు.
తాజాగా రణవీర్ సింగ్ 'పేపర్' మ్యాగజైన్కు చెందిన ఆశిష్ షా కోసం న్యూడ్ గా ఫోజులు ఇచ్చి ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ ఉన్నాడు. పేపర్ మ్యాగజైన్ కోసం నటుడి వైరల్ ఫోటో సిరీస్లో అతను చక్కటి ఆహార్యం కలిగిన జుట్టుతో నగ్నంగా, కార్పెట్పై కూర్చొని కెమెరాకు పోజులిచ్చాడు. కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం 1972 షూటింగ్లో నగ్నంగా కనిపించిన 70ల పాప్ ఐకాన్ బర్ట్ రేనాల్డ్స్కు ఈ ఫోటోషూట్ నివాళి అని అంటున్నారు. ఈ ఫోటోలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ క్రియేట్ అవుతున్నాయి.
రణవీర్ సింగ్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డేతో కలిసి 'సర్కస్'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం 2022 క్రిస్మస్కు విడుదల కానుంది. అలియా భట్, ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్లతో కరణ్ జోహార్ తీస్తున్న "రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ" లో రణవీర్ లీడ్ రోల్ లో చేస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 11, 2023న రిలీజ్ అవ్వాల్సి ఉంది.
News Summary - Ranveer Singh bares it all in a photoshoot, fans feel it's a tribute to Burt Reynolds
Next Story