పెళ్లే కాదు.. కెరీర్ కూడా ముఖ్యమే
బాలీవుడ్ లో హాటెస్ట్ క్యూట్ లవర్స్ అయిన దీపికా పదుకొనె, రన్వీర్ సింగ్ లు ఈ నెల 14, 15 తేదీల్లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న విషయం తెలిసిందే. గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది పెళ్లితో ఒక్కటైంది. ప్రస్తుతం ఈ జంట పెళ్ళై పదిరోజులు గడుస్తున్నాయి. పెళ్ళికి కేవలం అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబాల పెద్దలు మాత్రమే హాజరవగా... అతిధుల కోసం దీపికా, రణ్వీర్ ల జంట బెంగుళూరులో, ముంబై లో రెండు చోట్ల రెండు వేర్వేరు డేట్స్ తో రిసెప్షన్ ఏర్పాట్లు చేసింది. పెళ్లి తర్వాత మొన్న 21 న బెంగుళూరు లో రిసెప్షన్ లో పాల్గొన్న ఈ జంట రేపు 28 న ముంబై రిసెప్షన్ కోసం రెడీ అవుతున్నారు.
ఇకపోతే దీపికా, రణ్వీర్ ల జంట పెళ్లి, రిసెప్షన్ ఫొటోస్ సామజిక మద్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే పెళ్లి, రెసెప్షన్స్ తో హడావిడిగా తిరుగుతున్న ఈ జంట ఇప్పట్లో సినిమాల గురించి ఆలోచించరు అనుకున్నారు. మరి పెళ్లి తో బాగా బిజీ అయిన ఈ జంట హాని మూన్ తో రెస్ట్ తీసుకుంటారనుకున్నారు. కానీ రన్వీర్ అప్పుడే తన సినిమా ప్రమోషన్స్ కోసం దిగిపోయాడు కూడా. తెలుగులో ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాని హిందీలో రన్వీర్ సింగ్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నాడు. ఆ సినిమా హిందీలో సింబా పేరుతొ తెరకెక్కుతుంది. అయితే ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పెళ్లి వేడుకల్లో పాల్గొన్నాడు రన్వీర్.
వచ్చే నెల లో విడుదల రాబోయే సింబా సినిమా తన పాత్రకి డబ్బింగ్ చెప్పడానికి రన్వీర్ సింగ్ అప్పుడే రంగంలోకి దిగిపోయాడు. డిసెంబర్ నెలాఖరులో విడుదల కాబోతున్న ఈ సినిమా విడుదలకు టైం లేకపోవడంతో... రన్వీర్ పెళ్లి పనులు ముగించుకుని కాస్త కూడా రెస్ట్ తీసుకోకుండా సింబా డబ్బింగ్ కి వచ్చేసాడు. మరి మామూలుగానే రణ్వీర్ సింగ్ ఎంత ఎనర్జిటిక్ పర్సనో తెలుసు. మరి పెళ్లి తో బాగా ఎంజాయ్ చేసిన రన్వీర్ ప్రస్తుతం తన సినిమా సింబా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనబోతున్నాడట. మరి పెళ్లే కాదు.. కెరీర్ కూడా ముఖ్యమే అన్నట్టుగా లేదు రన్వీర్ ఆలోచన