Fri Dec 20 2024 22:28:58 GMT+0000 (Coordinated Universal Time)
రామ్చరణ్ మరో హీరోయిన్ని పరిచయం చేయబోతున్నాడా..?
రామ్చరణ్ RC16 సినిమాలో హీరోయిన్ గా ఆ బాలీవుడ్ నటి కూతురు నటించబోతుందా..?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం తమిళ డైరెక్టర్ శంకర్ తో 'గేమ్ ఛేంజర్' (Game Changer) సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ తరువాత 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబుతో RC16 చేయబోతున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎవరెవరు పని చేయబోతున్నారని అందరిలో ఆసక్తి నెలకుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఈ మూవీలో రామ్ చరణ్ కి జోడిగా ఎవరు కనిపించబోతున్నారని అభిమానులంతా ఎంతో క్యూరియాసిటీతో చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ హీరోయిన్ గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది. ఈ సినిమాతో రామ్ చరణ్ మరో హీరోయిన్ ని వెండితెరకు పరిచయం చేయబోతున్నాడని తెలుస్తుంది. బాలీవుడ్ హీరోయిన్ 'రవీనా టాండన్' కూతురు రాషా తడాని (Rasha Thadani) హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది.
RC16 సినిమా కోసం ఈ భామని తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. రీసెంట్ గా లుక్ టెస్ట్ లో పాల్గొనడానికి రాషా తడాని హైదరాబాద్ కూడా వచ్చిందని అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. మరి ఈ భామని బుచ్చిబాబు సెలెక్ట్ చేశాడా లేదా అనేది తెలియాలి. కాగా రామ్ చరణ్ ఫస్ట్ మూవీ చిరుతతో 'నేహా శర్మ'ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పుడు RC16 లో రాషా తడాని సెలెక్ట్ అయితే రామ్ చరణ్ లిస్ట్ లో మరో భామ ఎంట్రీ చేరుతుంది.
ఇక గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే.. ఈ మూవీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదు. దీంతో ఇటీవల ఒక అభిమాని సూసైడ్ నోట్ రాస్తూ.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని చిత్ర యూనిట్ ని బెదిరించే ప్రయత్నం చేశాడు. అయినాసరి మూవీ టీం నుంచి ఏ రెస్పాన్స్ లేదు. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ కి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
Next Story