Mon Dec 23 2024 15:56:38 GMT+0000 (Coordinated Universal Time)
రొమాంటిక్ సీన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాశీ ఖన్నా
రాశీ ఖన్నా హీరోయిన్గా, గోపీచంద్ హీరోగా నటించిన సినిమా 'పక్కా కమర్షియల్' జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాశీ ఖన్నా హీరోయిన్గా, గోపీచంద్ హీరోగా నటించిన సినిమా 'పక్కా కమర్షియల్' జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా రాశీ ఖన్నా ఆసక్తిర విషయాలను బయటపెట్టింది. కామెడీ సీన్స్ చేయడం కన్నా.. రొమాంటిక్ సీన్స్లో నటించడమే ఇష్టమని స్టేట్మెంట్స్ ఇస్తోంది రాశీ ఖన్నా. ఎలాంటి సినిమాల్లో నటించడం మీకు ఇష్టం అని అడగ్గా.. 'నాకు రొమాంటిక్ సీన్స్ అంటే ఇష్టం. కామెడీ సీన్స్ కంటే.. రొమాంటిక్ సీన్లలో నటించడమే సులభం. ఇప్పటివరకు నేను రొమాంటిక్ సీన్లలో యాక్ట్ చేశా. ప్రస్తుతం కామెడీ జోనర్ను ఎంజాయ్ చేస్తున్నా..' అని రాశీ చెప్పుకొచ్చింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సినీ హీరోయిన్ రాశీ ఖన్నా.. తోమాల సేవలో పాల్గొన్న ఆమె, స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జూలై 1న విడుదల కాబోతున్న పక్కా కమర్షియల్ చిత్రం ఘనవిజయం అందుకోవాలని స్వామివారిని ప్రార్థించినట్టు రాశీ ఖన్నా తెలిపారు. ఆమెతో పాటు ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రాశీ ఖన్నా మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పక్కా కమర్షియల్ సినిమా కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా అని, ప్రేక్షకులు అందరూ కుటుంబ సమేతంగా సినిమా వీక్షించి సినిమాను ఆదరించాలని ఆమె కోరారు. తనను ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికి మనస్సు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాశిఖన్నా చెప్పారు. తెలుగులో మరికొన్ని చిత్రాలు చేయబోతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
Next Story