సుధీర్ తో పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చిన రష్మీ
ప్రస్తుతం బుల్లితెర మీద హాట్ యాంకర్స్ జోరు మాములుగా లేదు. అనసూయ, రష్మీ అయితే జబర్దస్త్ తో ఫుల్ ఫేమ్ సంపాదించారు. అనసూయ, రష్మీ లు అందాలు ఆరబోస్తూ యాంకరింగ్ చేస్తూ మిగతా యాంకర్స్ కి గట్టి పోటీనిస్తున్నారు. అనసూయ, రష్మీ లు తమ టాలెంట్ తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రష్మీ గౌతమ్ సినిమాలను పక్కన పెట్టేసి యాంకరింగ్ మీదే దృష్టి పెట్టింది. జబర్దస్త్, ఢీ షో దగ్గరనుండి ఈ టీవీ కామెడీ షోలకు యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఇక గత కొన్నాళ్లుగా జబర్దస్ట్ ఫేమ్ సుధీర్ - రష్మీ గౌతమ్ లు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఒకటే వార్తలు. ఇక షో లో వారు చేసే పనులను చూసిన ఎవ్వరైనా వీరి మద్యన ఏదో ఉందని ఫిక్స్ అవుతారు కూడా.
ఫుల్ క్లారిటీ ఇచ్చిన రష్మీ...
అందులోనూ గత ఉగాది వేడుకల్లో ఇద్దరూ కలిసి ఉగాది ప్రోగ్రాంలో నిజంగా పెళ్లి చేసుకున్నారా అనిపించేలా ఒక ప్రోగ్రాం చెయ్యడంతో నిజంగానే సుధీర్ కి రష్మీకి మధ్యన ఏదో నడుస్తుందని... వారు త్వరలోనే పెళ్లాడబోతున్నారని కూడా ప్రచారం వీర లెవల్లో జరుగుతుంది. ఇక వీరు యాంకరింగ్ చేసే షోలలో రష్మీ, సుదీర్ ల మీద ఎన్ని జోకులేసిన వీరిద్దరూ మాట్లాడరు. అయితే తాజాగా ట్విట్టర్ అభిమాని ఒకరు రష్మీ కి పెళ్లి కోసం ఒక అందమైన సలహా ఇవ్వగా.. దానికి రష్మీ మాములుగా ఫైర్ అవలేదు. ఇంతకీ ఆ అభిమాని ఏమడిగాడంటే.. రష్మీ నువ్వు సుధీర్ని పెళ్లి చేసుకో.. మీరిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు ఉంటారు.. మీ కెరీర్ కోసం కష్టపడి పని చేస్తున్నారు... అంటూ ఒక సలహా పారేసాడు.
ట్విట్టర్ అభిమానికి క్లాస్...
దీనికి రష్మీ ఎంతగా ఫైర్ అయ్యింది అంటే... మేము తెరపై నటిస్తుండగా మాత్రమే మీరు చూశారు.. మేము ప్రేక్షకుల కోసం కావాల్సినంత ఎంటెర్టైన్మెంట్ పండించడానికి నటిస్తున్నాం. ఆ మాత్రానికే మేము ఒకరి కోసం ఒకరం పుట్టామని మీరెలా అనుకుంటారు. అసలు మీరు ముందుగా రియల్ లైఫ్, రీల్ లైఫ్ లని వేర్వేరుగా చూడడం నేర్చుకోండి. అంతేకాని మేము ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది మా పర్సనల్ విషయం. అంతేకాని మా పెళ్లిళ్ల విషయంలో మీరు ఉచిత సలహాలు ఇవ్వక్కర్లేదు. అంటూ కోపంతో ఊగిపోయింది.