హీరోయిన్ అన్నాక అన్నీ వస్తాయి?
హీరోయిన్స్ కి కాస్త క్రేజ్ వచ్చినా .. కాస్త ఫేమ్ వచ్చినా.. వారిపై రూమర్స్ కూడా అదే రేంజ్ లో సోషల్ మీడియాలో ప్రచారంలోకొస్తాయి. ఆ హీరోయిన్ [more]
హీరోయిన్స్ కి కాస్త క్రేజ్ వచ్చినా .. కాస్త ఫేమ్ వచ్చినా.. వారిపై రూమర్స్ కూడా అదే రేంజ్ లో సోషల్ మీడియాలో ప్రచారంలోకొస్తాయి. ఆ హీరోయిన్ [more]
హీరోయిన్స్ కి కాస్త క్రేజ్ వచ్చినా .. కాస్త ఫేమ్ వచ్చినా.. వారిపై రూమర్స్ కూడా అదే రేంజ్ లో సోషల్ మీడియాలో ప్రచారంలోకొస్తాయి. ఆ హీరోయిన్ వాళ్లతో తిరుగుతుంది, సీక్రెట్ గా బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తుంది, బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది అబ్బో ఇలాంటి న్యూస్ చాలానే వింటుంటాం. అయితే హీరోయిన్స్ అన్నాక ఇలాంటి న్యూస్ లు మామూలే అంటుంది ప్రస్తుతం వరస హిట్స్ తో దూసుకుపోతున్న రష్మిక మందన్న. ఇండస్ట్రీలోకొచ్చిన ప్రతి హీరోయిన్ కి ఇలాంటి రూమర్స్ తప్పవంటుంది.
హీరోయిన్స్ అన్నాక వ్యక్తిగతంగా ఏదో విషయంలో సమస్యలు వస్తూనే ఉంటాయని, హీరోయిన్స్ పై రోజుకో వార్త గాసిప్ రూపంలో వస్తూనే ఉంటుంది అని, అలాంటి రూమర్స్ గురించి నేనస్సలు పట్టించుకోనని చెబుతుంది రష్మిక మందన్న. డేట్స్ చూసుకుని షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం, టైం కి సెట్స్ కి వెళ్లి షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికొచ్చేసరికి సమయం మొత్తం గడిచిపోతుంది. షూటింగ్స్ తో బిజీగా ఉంది కొన్నిసార్లు తినడం కూడా మర్చిపోతామని, అలాంటి సమయంలో ఇలాంటి రూమర్స్ ని పట్టించుకునే తీరిక ఉండదని అంటుంది. కెరీర్ తొలినాళ్లలో కాస్త బాధపడినా… ప్రస్తుతం అలవాటైపోయింది అని చెబుతుంది రష్మిక.
- Tags
- rashmika