Mon Dec 23 2024 07:19:50 GMT+0000 (Coordinated Universal Time)
ఆ పెళ్ళిలో రష్మిక కట్టిన చీర ఖరీదు ఎంతో తెలుసా?
నేషనల్ క్రష్ రష్మిక మందాన తాజాగా తన అసిస్టెంట్ పెళ్లికి హాజరై అక్కడున్నవారందరిని
నేషనల్ క్రష్ రష్మిక మందాన తాజాగా తన అసిస్టెంట్ పెళ్లికి హాజరై అక్కడున్నవారందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె రాకతో పెళ్లికి వచ్చిన వారందరూ షాక్ అయ్యారు. రష్మిక అసిస్టెంట్ సాయి వివాహం హైదరాబాద్లోని బహదూర్పల్లిలో జరిగింది. ఈ పెళ్లికి రష్మిక మందాన హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ పెళ్లి వేడుకలలో రష్మిక ఆరెంజ్ రంగు చీర ధరించింది.ఇక ఈ చీర చూడటానికి సింపుల్ గా ఉన్న రష్మిక మాత్రం చాలా స్టైలిష్ గా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రష్మిక అనితా డోంగ్రే మిధా డిజైన్ చేసిన నారింజ రంగు చీరలో అందంగా కనిపించింది. దీని ధర దాదాపు 35000 రూపాయలు కావడంతో అందరూ షాక్ అవుతున్నారు. రష్మికకు ఈ చీరను ఆమె తల్లి ఇచ్చింది. రష్మిక పుట్టినరోజు సందర్భంగా కానుకగా ఇచ్చారు. పుట్టినరోజు సందర్భంగా తన తల్లి కానుకగా ఇవ్వడంతో ఈ శారి అంటే తనకు ఎంతో ప్రత్యేకమని అందుకే ఈ పెళ్లి వేడుకలో ఈ చీర కట్టుకున్నాను అంటూ ఈ సోషల్ మీడియా వేదికగా రష్మిక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో ‘పుష్ప-2’ ‘రెయిన్బో’ చిత్రాలతో పాటు శేఖర్ కమ్ముల-ధనుష్ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.
Next Story