చైతూకి షాకిచ్చిన రష్మిక
ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న రష్మిక కన్నడ భామ. కన్నడ ఇండస్ట్రీలో కన్నా ఎక్కువగా రష్మిక తెలుగు పిల్ల అయ్యింది. గీత గోవిందంతో [more]
ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న రష్మిక కన్నడ భామ. కన్నడ ఇండస్ట్రీలో కన్నా ఎక్కువగా రష్మిక తెలుగు పిల్ల అయ్యింది. గీత గోవిందంతో [more]
ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న రష్మిక కన్నడ భామ. కన్నడ ఇండస్ట్రీలో కన్నా ఎక్కువగా రష్మిక తెలుగు పిల్ల అయ్యింది. గీత గోవిందంతో అందరి ఇంట్లో గీత లా ఫేమస్ అయిన రష్మిక, మహేష్ లాంటి స్టార్ హీరో పక్కన సరిలేరు నీకెవ్వరూ అంటుంది. అంతేకాకుండా నితిన్ భీష్మ సినిమాలోనూ నటిస్తుంది. తెలుగు, తమిళ సినిమాల్తో క్షణం తీరిక లేని రష్మికకి మరో స్టార్ హీరో అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో కూడా హీరోయిన్ ఛాన్స్ వచ్చిందనే ప్రచారం ఉంది.
చైతు సరసన ఎవరోస్తారో….
దిల్ రాజు నిర్మాతగా నాగ చైతన్య హీరోగా ఓ సినిమా త్వరలోనే మొదలు కానుంది. ఆ సినిమాలో రశ్మికనే హీరోయిన్ అని జెమిని ఛానల్ కన్ఫర్మ్ చేసింది. ఎందుకంటే చైతు – రష్మికల సినిమా శాటిలైట్ హక్కులను మేమే సొంతం చేసుకున్నామంటూ ట్వీట్ చేసింది జెమిని ఛానల్. చైతు రీసెంట్ మూవీ వెంకిమామ సినిమా పూర్తి కావడం, శేఖర్ కమ్ముల సినిమా పూర్తి కాగానే చైతు – రష్మిక ల సినిమా పట్టాలెక్కుతోంది అని అనుకున్నారు. తాజాగా రష్మిక, నాగ చైతన్యకి షాకిచ్చినట్లుగా తెలుస్తుంది. తాను ఈ సినిమా చెయ్యలేనని చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి డేట్స్ ప్రాబ్లమా? చిన్న హీరో అని ఆలోచించిందా? అనేది తెలియదు కానీ.. రష్మిక మాత్రం చైతు – దిల్ రాజు సినిమాలో చెయ్యడం లేదనేది ఫిలింనగర్ టాక్. రష్మిక కాదనడంతో చైతూ కోసం మరో హీరోయిన్ ని వెతికే పనిలో టీం ఉన్నట్లుగా సమాచారం.