Thu Dec 19 2024 16:33:13 GMT+0000 (Coordinated Universal Time)
రష్మిక కాళ్ళకు నమస్కరించిన వధూవరులు.. వీడియో వైరల్!
రష్మిక మందన్న కాళ్ళకు నమస్కరించిన నూతన వధూవరులు. వైరల్ అవుతున్న వీడియో.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ పరిశ్రమలో ఒక చిన్న సినిమాతో కెరీర్ స్టార్ చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ.. నేడు నార్త్ టు సౌత్ వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ ఫుల్ బిజీ యాక్ట్రెస్ గా మారిపోయింది. కాగా ఈ అమ్మడు ఏం చేసిన సోషల్ మీడియాలో కచ్చితంగా వైరల్ అవ్వడం ఖాయం. అయితే ఈసారి రష్మిక ఏమి చేయకుండానే నెట్టింట తెగ వైరల్ అయ్యిపోతుంది.
తాజాగా రష్మిక హైదరాబాద్ లో జరిగిన తన అసిస్టెంట్ సాయి వివాహానికి హాజరయ్యింది. ఈ పెళ్లి వేడుకకు పసుపు రంగు చీరలో సంప్రదాయ పద్దతిలో వచ్చి అందర్నీ ఆకట్టుకుంది. అయితే ఈ పెళ్లి మండపంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రష్మిక వధూవరులను కలుసుకొని, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న సమయంలో ఆ కొత్త జంట.. ఆశీర్వాదం తీసుకోవడానికి రష్మిక కాళ్లకు నమస్కరించారు. ఒక్కసారిగా కొత్తజంట కాళ్ళ పై పడడంతో రష్మిక ఎమోషనల్ అయ్యింది.
ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అలాగే తనకున్న బిజీ షెడ్యూల్ లో కూడా రష్మిక.. తన అసిస్టెంట్ పెళ్ళికి హాజరుకావడం పై పలువురు నెటిజెన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా రష్మిక చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో బాలీవుడ్ మూవీ 'యానిమల్' (Animal) ముందుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ వంగా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ.. డిసెంబర్ నెలలో రిలీజ్ కానుంది.
ఇక అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది. అలాగే 'రెయిన్ బో' అనే ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ, తమిళ్ హీరో ధనుష్ తో ఒక మూవీ చేస్తుంది. ఈ రెండు సినిమాలు చిత్రీకరణ మొదలుపెట్టుకోవాల్సి ఉంది. ధనుష్ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కముల డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో బై లింగువల్ గా తెరకెక్కబోతుంది.
Next Story