నాకు టాలెంట్ ఉంది…లక్కీ కాదు
ఛలో లాంటి చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయం రష్మిక మందన్న చాల తక్కువ కాలంలోనే పెద్ద హీరోయిన్ గా ఎదిగింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ [more]
ఛలో లాంటి చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయం రష్మిక మందన్న చాల తక్కువ కాలంలోనే పెద్ద హీరోయిన్ గా ఎదిగింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ [more]
ఛలో లాంటి చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయం రష్మిక మందన్న చాల తక్కువ కాలంలోనే పెద్ద హీరోయిన్ గా ఎదిగింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోస్ పక్కన చేసే ఛాన్స్ కొట్టేసింది ఈ కన్నడ బ్యూటీ. రీసెంట్ గా ఆమె నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం యొక్క ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె ను మీరు చాలా లక్కీ కదా ఇలా పెద్ద సినిమా అవకాశాలు వస్తున్నాయి అని అడిగిన ప్రశ్నకు మీడియా వారికి గట్టిగానే సమాధానం ఇచ్చింది.
డియర్ కామ్రేడ్ సినిమాలో 10 నిముషాలు ఉండే క్రికెట్ సీన్స్ కోసం నేను నాలుగు నెలలు ట్రైనింగ్ తీసుకున్న. నటిగా తనేంటో రుజువు చేసుకోవడానికి చాలా కష్టపడ్డా. తన భాష కానీ భాషలో తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పా. డబ్బింగ్ చెప్పుకుంటానని నేనే డైరెక్టర్ ని అడిగి. అలా అడిగిన పాపానికి తనతో 60-70 రోజుల పాటు డబ్బింగ్ చెప్పించారని.. చిన్న చిన్న డైలాగుల దగ్గర కూడా రాజీ పడలేదని చెప్పుకొచ్చింది.
తనకు టాలెంట్ ఉంది కాబట్టే పెద్ద సినిమాలు వస్తున్నాయని అంతే కానీ అదృష్టం వల్ల కాదని తేల్చి చెప్పింది రష్మిక మందన్న. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమాలో తను హీరోయిన్ అని ధ్రువీకరించిన రష్మిక, అలానే మహేష్ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ లో కూడా నటిస్తున్నానని ఆయనతో నటించడం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని రష్మిక తెలిపింది.