Sun Dec 22 2024 17:10:15 GMT+0000 (Coordinated Universal Time)
మహేశ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు రష్మిక ఎంత డిమాండ్ చేసిందో తెలుసా
అయితే స్పెషల్ సాంగ్ కు రష్మిక భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని టాక్. పుష్పతో పాన్ ఇండియా స్టారైన ..
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ లో ఉన్న హీరోయిన్ రష్మిక మందన్న. పుష్ప సినిమాతో ఈ అమ్మడి క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకోవడంతో.. రెమ్యునరేషన్ పెంచేసింది. గ్లామర్ కి గ్లామర్, పర్ఫార్మెన్స్ కి పర్ఫార్మెన్స్ చేస్తూ.. ఆడియన్స్ ని అలరిస్తున్న రష్మిక.. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. ఇక పుష్ప తర్వాత.. తెలుగులో పుష్ప-2లో నటించేందుకు రెడీగా ఉంది.
కాగా.. ఇటీవల రష్మిక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా మూవీ SSMB28 అనే సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తోందంటూ వార్తలు వైరలయ్యాయి. అయితే స్పెషల్ సాంగ్ కు రష్మిక భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని టాక్. పుష్పతో పాన్ ఇండియా స్టారైన రష్మిక ఈ సాంగ్ చేస్తే.. తన సినిమా నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందుతుందని త్రివిక్రమ్ ప్లాన్. కానీ.. ఒక్క సాంగ్ కే రష్మిక రూ.4 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తనకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకునే అమ్మడు ఈ రేంజ్లో డిమాండ్ చేసిందని సినీ వర్గాలు అంటున్నాయి. మరి రష్మిక డిమాండ్‌కు SSMB28 మేకర్స్ ఓకే చెబుతారా.. లేక మరొక బ్యూటీతో ఈ స్పెషల్ సాంగ్ చేయిస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారో అని మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Next Story