Mon Dec 23 2024 08:13:31 GMT+0000 (Coordinated Universal Time)
Rashmika: విజయ్ సలహా తీసుకునే.. నేను ఏదైనా చేస్తాను.. రష్మిక కామెంట్స్
విజయ్ దేవరకొండ సలహా తీసుకునే తాను ఏదైనా పని చేస్తాను అంటున్న రష్మిక.
Rashmika Mandanna - Vijay Deverakonda : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఆన్ స్క్రీన్ పై తమ కెమిస్ట్రీతో అందర్నీ ఆకట్టుకున్నారు. అయితే ఆ కెమిస్ట్రీని ఆఫ్ స్క్రీన్ లో కూడా కొనసాగిస్తున్నారంటూ వార్తలు వస్తున్నప్పటికీ, వారిద్దరూ మాత్రం.. తమ మధ్య ఉన్నది ఒక మంచి స్నేహమే అంటూ చెప్పుకొస్తున్నారు. కానీ బయట వీరిద్దరి మధ్య స్నేహం, పలు ఇంటర్వ్యూల్లో ఒకరి పై ఒకరు ప్రేమ కురిపించుకుంటూ మాట్లాడే మాటలు చూస్తే.. ప్రతి ఒక్కరికి ప్రేమ లాగానే కనిపిస్తుంటుంది.
ఇక రీసెంట్ గా రష్మిక ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో రష్మిక వర్క్ చేసిన హీరోల గురించి మాట్లాడే నేపథ్యంలో, విజయ్ గురించి కూడా మాట్లాడుతూ.. "మేము ఇద్దరం కెరీర్ లో కలిసి ఎదుగుతూ వస్తున్నాము. విజయ్ ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉంటాడు. ఏది మంచి ఏది చెడు అనేదాని ముక్కుసూటిగా చెప్పేస్తాడు. అందుకనే నేను ఏం చేసినా విజయ్ సలహా తీసుకుంటున్నాను. నేను చేసే ప్రతి దానిలో విజయ్ భాగస్వామ్యం ఉంటుంది. పర్సనల్ విషయంలో కూడా విజయ్ నాకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తాడు. తనని నేను ఎంతో గౌరవిస్తుంటాను" అంటూ వ్యాఖ్యానించింది.
ఇక ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. తన ప్రొఫెషనల్ నుంచి పర్సనల్ విషయాలు వరకు విజయ్ భాగస్వామ్యం ఉంటుందని చెప్పడంతో.. వీరిద్దరి మధ్య ప్రేమ కన్ఫార్మ్ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల వీరిద్దరి పెళ్లి వార్త బాగా వైరల్ అయ్యింది. ఫిబ్రవరిలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో విజయ్ వాటిని కొట్టిపడేసారు. విజయ్, రష్మిక ఫ్యాన్స్ అయితే.. ఈ ఇద్దరు నిజంగానే రియల్ లైఫ్ లో కూడా జంటగా మారితే చూడాలని అనుకుంటున్నారు. మరి భవిషత్తులో ఏమవుతుందో చూడాలి.
Next Story