Fri Dec 20 2024 06:19:05 GMT+0000 (Coordinated Universal Time)
Prabhas : ప్రభాస్ సినిమాలో హీరోయిన్గా రష్మిక..
ప్రభాస్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా ఎంపిక అయ్యారట. ఏం సినిమానో తెలుసా..?
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా ఎంపిక అయ్యారట. రష్మిక కూడా పుష్ప, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ అందుకొని.. ఆమె కూడా పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నారు. ఇప్పుడు మరో పాన్ ఇండియా హిట్ అందుకునేందుకు ప్రభాస్ సినిమాకి ఓకే చెప్పేశారట. ఇంతకీ రష్మిక, ప్రభాస్ కలిసి ఏ సినిమా చేయబోతున్నారు..?
ప్రభాస్ చేతిలో ప్రస్తుతం సలార్ 2, కల్కి, రాజాసాబ్, కన్నప్ప సినిమాలు ఉన్నాయి. వీటి తరువాత సందీప్ వంగతో 'స్పిరిట్' అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ మూవీలో ప్రభాస్.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారు. ఇక ఆ పోలీసోడికి జోడిగా రష్మికని ఎంపిక చేశారట సందీప్ వంగ. కాగా ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్లో ఏ కథానాయిక.. ఇలా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ చేయడం లేదు. ఇప్పుడు ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లో కూడా రష్మిక సెలెక్ట్ అయ్యిందని తెలియడంతో.. ఆమె అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
ప్రస్తుతం రష్మిక చేతిలో ఉన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఏంటంటే.. పుష్ప 2, యానిమల్ పార్క్, స్పిరిట్. మరి ఈ చిత్రాలతో రష్మిక ఎలాంటి స్టార్డమ్ ని సంపాదించుకుంటారో చూడాలి. కాగా స్పిరిట్ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి పట్టాలు ఎక్కుతుందని దర్శకుడు సందీప్ వంగ తెలియజేసారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టి సిరీస్.. ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
Next Story