పిల్ల పిచ్చేక్కిస్తుందిగా..!
ఛలోలో డీసెంట్ గా గీత గోవిందంలో మేడం గీతగా ఈగోయిస్టు గా మెస్మరైజ్ చేసిన రష్మిక మందన్న దేవదాస్ లో మాత్రం నార్మల్ లుక్స్ తోనే ఆకట్టుకుంది. ప్రస్తుతం తనకి అచ్చొచ్చిన హీరో విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ లో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక ఎక్కువగా ట్రెడిషనల్ డ్రెస్సెస్ లోనే కనిపించి ఆకట్టుకుంది. ఎప్పుడూ హాట్ హాట్ గా దర్శనమియ్యలేదు. ఈ కన్నడ భామ కెరీర్ లో దూసుకుపోవాలంటే కాస్త గ్లామర్ గా కూడా కనబడాలని డిసైడ్ అయినట్లుగా అనిపిస్తుంది. అందుకే లైఫ్ లో పెళ్లికి తొందరపడి తర్వాత కెరీర్ పై ఆశలు పెట్టుకుని ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకుంది.
గ్లామర్ లుక్ లో...
ఇక కెరీర్ పై ఫోకస్ చేసిన ఈ భామ ట్రెడిషనల్ గా వెళితే కుదరదనుకుందేమో.. అందుకే గ్లామర్ గేట్లు ఎత్తడానికి రెడీ అయ్యింది. మరి పైన కనిపిస్తున్న ఫోటోలో రష్మిక గ్లామర్ గా కనబడకపోతేనేమి... కసిగా చూస్తూ పిచ్చెక్కిచ్చేస్తోంది. మరి కత్తిలాంటి చూపుతో.. రష్మిక కవ్విస్తుంటే... కుర్ర హీరోలందుకు ఆగుతారు.. తమ సినిమాల్లో పిలిచి మరీ అవకాశం ఇవ్వరా. అసలు ఈ రకమైన లుక్ లో రష్మిక ఎప్పుడు చూసుండరేమో....అన్నట్టుగా ఉంది అమ్మడు ఫోజు.