Mon Dec 23 2024 11:40:01 GMT+0000 (Coordinated Universal Time)
లీక్ చేయడం మొదలుపెట్టిన రష్మిక
అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న "పుష్ప 2: ది రూల్" కోసం ఎంతో ఎంతో మంది
అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న "పుష్ప 2: ది రూల్" కోసం ఎంతో ఎంతో మంది ఎదురుచూస్తూ ఉన్నారు. "పుష్ప: ది రైజ్" చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ అంతకు మించి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రను ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా నుండి వచ్చే అప్డేట్ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సంవత్సరం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటూ వీడియో కూడా అభిమానులకు ఊహించని కిక్ ఇచ్చింది.
ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న నేషనల్ క్రష్ రష్మిక సినిమా సెట్స్ కు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. రష్మిక "పుష్ప 2: ది రూల్" సెట్స్ నుండి ఒక చిత్రాన్ని పంచుకుంది. అందులో భారీ భవనాన్ని మనం చూడొచ్చు. పుష్ప ఉండే ఇళ్లు గురించి రష్మిక లీక్ చేసింది. పుష్ప భార్యగా రెండో పార్టులో కనిపించబోతోంది రష్మిక. ఇప్పుడు రష్మిక, బన్నీల మీద సీన్లను సుకుమార్ తెరకెక్కిస్తున్నట్టుగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్లో పుష్ప-2 విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే పుష్పకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా బన్నీకి, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్కు అవార్డులు వచ్చాయి.
Next Story