రష్మిక కి షాక్ ఇచ్చిన మాజీ ప్రియుడు?
రష్మిక మందన్న కన్నడ కిర్రాక్ పార్టీ ద్వారా సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఆ సినిమా హీరో రక్షిత్ తో ప్రేమ లో పడడం… తర్వాత [more]
రష్మిక మందన్న కన్నడ కిర్రాక్ పార్టీ ద్వారా సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఆ సినిమా హీరో రక్షిత్ తో ప్రేమ లో పడడం… తర్వాత [more]
రష్మిక మందన్న కన్నడ కిర్రాక్ పార్టీ ద్వారా సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఆ సినిమా హీరో రక్షిత్ తో ప్రేమ లో పడడం… తర్వాత తెలుగులో బిజీ కాకముందు.. రక్షిత్ తో నిశ్చితార్ధం చేసుకోవడం.. తెలుగులో బిజీ అయ్యాక ప్రియుడు రక్షిత్ కి హ్యాండ్ ఇచ్చి…. ఎంగేజ్మెంట్ రద్దు చేసుకోవడంతో.. రష్మిక ప్రేమ పెళ్ళికి ఫుల్ స్టాప్ పడింది. ఇక రష్మిక తెలుగులో ఫుల్ బిజీ తారగా మారిపోయి రక్షిత్ ని పట్టించుకోలేదు. కానీ రక్షిత్ మాత్రం కన్నడలో సినిమాలు చేసుకుంటున్నాడు. ఈమధ్యనే అతడు శ్రీమన్నారాయణతో అన్ని భాషల ప్రేక్షకులను పలకరించాడు కూడా.
అయితే తాజాగా రక్షిత్ తన సూపర్ హిట్ ఫిలిం కిర్రాక్ పార్టీకి సీక్వెల్ చెయ్యబోతున్నాడు. అయితే కిర్రాక్ పార్టీలో సూపర్ జోడి అనిపించుకున్న రక్షిత్ – రష్మిక ల జోడి మల్లి కిర్రాక్ పార్టీ సీక్వెల్ లో కనబడుతుంది అనుకుంటే… రక్షిత్ మాత్రం ఈ సినిమాలో అంత కొత్తవారే కనబడతారని సింపుల్ గా తేల్చేసాడు. దాన్ని బట్టి రష్మిక ప్లేస్ లో వేరే కొత్త హీరోయిన్ నటిస్తారని రక్షిత్ ఉద్దేశ్యం. మరి అలా రక్షిత్ రష్మిక ని చాలా సైలెంట్ గా తప్పించాడన్నమాట.