Mon Dec 23 2024 15:59:55 GMT+0000 (Coordinated Universal Time)
Rashmika : యానిమల్ మూవీలో రష్మిక పాత్ర ఆ హీరోయిన్ చేయాల్సింది..
యానిమల్ మూవీలో గీతాంజలి పాత్ర కోసం రష్మిక కంటే ముందు ఒక బాలీవుడ్ హీరోయిన్ ని దర్శకుడు ఎంపిక చేశారట. ఎవరు ఆ హీరోయిన్..?
Rashmika Mandanna : టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగ, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన బోల్డ్ వైల్డ్ యాక్షన్ మూవీ యానిమల్. ఈ సినిమాలో రష్మిక మెయిన్ హీరోయిన్ గా నటించగా తృప్తి దిమ్రీ సెకండ్ హీరోయిన్ గా చేశారు. అయితే ఈ సినిమాలో గీతాంజలి పాత్ర కోసం రష్మిక కంటే ముందు ఒక బాలీవుడ్ హీరోయిన్ ని దర్శకుడు ఎంపిక చేశారట. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్..?
సందీప్ వంగ, రన్బీర్ కి కథ చెప్పి ఓకే చేసిన తర్వాత సినిమాలో హీరోయిన్ కోసం బాలీవుడ్ భామ పరిణితి చోప్రాని సంప్రదించారట. ఆమెకు కథ వినిపించడం, ఆమె ఓకే చేసి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కరోనా లాక్ డౌన్ కి ముందు జరిగిన విషయం. ఈ ఏడాదిన్నర గ్యాప్ లో సందీప్ వంగకి.. గీతాంజలి పాత్రకు పరిణితి కరెక్ట్ కాదేమో అని అనిపించిందట. మరో 12 రోజుల్లో షూట్ ప్రారంభం అవుతుంది అనగా సందీప్, పరిణితి వద్దకు వెళ్లి విషయం చెప్పారట.
"పరిణితి చోప్రా మంచి నటి అని అందరికీ తెలిసిందే. కానీ గీతాంజలి పాత్రకి ఆమె సెట్ అవ్వరని అనిపించింది. అదే విషయాన్ని ఆమెకు చెప్పాను. ఆమె టైం వృధా చేసినందుకు కూడా క్షమాపణలు అడిగాను. ఆమె కూడా అర్థం చేసుకొని సినిమా నుంచి తప్పుకున్నారు. అయితే ఒక మంచి అవకాశం మిస్ అయినందుకు ఆమె చాలా బాధపడ్డారు" అని సందీప్ వంగ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్ ఇంట వైరల్ గా మారాయి.
ఇది పక్కన పెడితే, యానిమల్ మూవీలో మెయిన్ హీరోయిన్ రష్మిక అయినప్పటికీ.. ఆడియన్స్ లో సెకండ్ హీరోయిన్ అయినా తృప్తి దిమ్రీకి ఎక్కువ క్రేజ్ వస్తుంది. రణబీర్, తృప్తి మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. దీంతో తృప్తికి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. ఆల్రెడీ కొన్ని సినిమా ఆఫర్స్ కూడా తృప్తి వద్దకు చేరాయట. వీటిలో టాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
Next Story